China : చైనాలో దారుణంగా పరిస్థితులు.. 50 వేలకు పైగా కేసులు..!

China :  చైనాలో దారుణంగా పరిస్థితులు.. 50 వేలకు పైగా కేసులు..!
China : కరోనాతో విలవిలలాడుతోంది చైనా. ఈ వైరస్‌ ఇప్పుడు డ్రాగన్‌ కంట్రీని ముప్పుతిప్పలు పెడుతోంది.

China : కరోనాతో విలవిలలాడుతోంది చైనా. ఈ వైరస్‌ ఇప్పుడు డ్రాగన్‌ కంట్రీని ముప్పుతిప్పలు పెడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా అదుపులోనే ఉన్నా చైనాలో మాత్రం కరోనా మరింత ఉద్ధృతమైంది. ముఖ్యంగా ఒమిక్రాన్‌ వేరియంట్‌తో... కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నెలలో ఇప్పటి వరకు 50 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కరోనా విజృంభిస్తుండటంతో చైనాలోని పెద్ద నగరాలు కూడా పూర్తి లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోతున్నాయి. ఈ నెల 1 నుంచి ఇప్పటి వరకు 56వేల కేసులు నమోదైనయ్యాయి. వీటిలో సగానికిపైగా కేవలం జిలిన్‌ ప్రావిన్సులోనే నమోదయ్యాయి.

రోజురోజుకు పెరుగుతున్న కేసులతో చైనాలో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. కరోనా ముప్పు తొలగించుకునేందుకు అనేక చర్యలు తీసుకుంటోంది చైనా ప్రభుత్వం. డైనమిక్‌ జీరో కొవిడ్‌ లక్ష్యాన్ని స్వల్ప కాలంలో సాధించేందుకు కృషి చేస్తున్నట్లు చైనా సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ నిపుణులు చెబుతున్నారు. త్వరలోనే కొవిడ్‌ ముప్పు నుంచి బయట పడతామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

జీరో కొవిడ్‌ వ్యూహంతో లాక్‌డౌన్‌లు, భారీ స్థాయిలో కొవిడ్‌ పరీక్షలు, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ వంటి కఠిన చర్యలు చేపడుతూ కేసుల సంఖ్యను సున్నాకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది చైనా. అయినప్పటికీ వైరస్‌ ఉద్ధృతి తగ్గడం లేదు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కరోనా కట్టడి వ్యూహాన్ని సడలిస్తున్నట్లు పేర్కొంది. అదే సమయంలో డైనమిక్‌ కొవిడ్‌ జీరో వ్యూహాన్ని అమలు చేస్తోంది. అంటే నగరాల్లో మొత్తం ఒకేసారి ఆంక్షలు కాకుండా స్థానికంగా పరీక్షలు, కట్టడి చర్యలతో ముందుకు వెళ్తోంది.

చైనాలో వ్యాక్సిన్‌ పంపిణీ కొనసాగినా... చాలా మందికి అది చేరలేదు. 60 ఏళ్ల వయసుపైబడిన వారిలోనే ఇంకా 5 కోట్ల మందికి ఒక్క డోసు కూడా తీసుకోలేదు. బూస్టర్‌ డోసుల పంపిణీ కూడా మందకొడిగానే సాగుతోంది. కేవలం 50 శాతం మంది మాత్రమే బూస్టర్‌ తీసుకున్నారు. అందుకే వైరస్‌ తిరిగి వ్యాపించినట్లు చెబుతున్నారు. మరోవైపు హాంకాంగ్‌లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. గత నెల రోజులుగా నిత్యం 200 మంది కరనాతో చనిపోతున్నారు. రోజూ పదివేలకుపైగా కరోనా కేసులు నమోదవతున్నాయి. ఇటీవల మొదలైన వేవ్‌లో ఒక్క హాంకాంగ్‌లోనే పదిలక్షల కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీంతో చైనా అధికారుల్లో ఆందోళన మొదలయ్యింది.

Tags

Read MoreRead Less
Next Story