China Conspiracy : భారత సార్వత్రిక ఎన్నికల్లో చైనా జోక్యం

China Conspiracy : భారత సార్వత్రిక ఎన్నికల్లో చైనా జోక్యం
కేంద్రాన్ని హెచ్చరించిన మైక్రోసాఫ్ట్

సార్వత్రిక ఎన్నికల్లో చైనా అవాంతరాలు సృష్టించే అవకాశం ఉందని మైక్రోసాఫ్ట్‌ హెచ్చరించింది. సంద‌ట్లో సడేమియా అన్నట్లు కృత్రిమమేధ ద్వారా ...ఈ ఎన్నికలను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. భారత్‌ సహా అమెరికా, దక్షిణ కొరియా ఎన్నికల్లో డ్రాగన్ దేశం జోక్యం చేసుకునే ప్రమాదం ఉందని మైక్రోసాఫ్ట్‌ సహ-వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ అప్రమత్తం చేశారు.

సార్వత్రిక ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకునే ప్రమాదం ఉన్నట్లు మైక్రోసాఫ్ట్‌ హెచ్చరించింది. కృత్రిమ మేధ ద్వారా లోక్‌సభ ఎన్నికలపై డ్రాగన్‌ ప్రభావం చూపనుందని...ఓ నివేదిక విడుదల చేసింది. కృత్రిమ మేధస్సుతో రూపొందించిన కంటెంట్‌ ద్వారా భారత్, అమెరికా, దక్షిణ కొరియాలో జరిగే ఎన్నికలకు విఘాతం కలిగించేందుకు...డ్రాగ్‌ కుట్ర చేస్తోందని మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది. ప్రజాభిప్రాయాన్ని తమ ప్రయోజనాలకు అనుకూలంగా మార్చుకునేందుకు...A.I.ఆధారిత కంటెంట్‌ ద్వారా సామాజిక మాధ్యమాల్లో చైనా ప్రచారం చేసే ప్రమాదం ఉన్నట్లు తెలిపింది. మీమ్స్‌, వీడియోలు, ఆడియో రూపంలో ప్రచారం చేయొచ్చని ...భారత్‌ను అప్రమత్తం చేసింది. డీప్‌ఫేక్‌ సాంకేతికతను కూడా ఉపయోగించి...చైనా తనకు అనుకూలంగా ప్రచారాన్ని మార్చుకునే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అయితే, ఇలాంటి కుయుక్తులు సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం తక్కువేనని మైక్రోసాఫ్ట్ తన నివేదికలో పేర్కొంది. అయితే కాలక్రమేణా మరింత ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉందని... మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది.

ఉత్తర కొరియా ప్రమేయంతో చైనా మద్దతు ఉన్న సైబర్‌ గ్రూపులు 2024లో అనేక దేశాల్లో జరిగే ఎన్నికలను లక్ష్యంగా చేసుకున్నట్లు మైక్రోసాఫ్ట్‌... అనుమానం వ్యక్తం చేసింది. అందుకోసం కృతిమ మేథను అస్త్రంగా చేసుకున్నాయని...ఆరోపించింది. ఈ ఏడాది EUతోపాటు 64దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయని మైక్రోసాఫ్ట్ పేర్కొంది. ప్రపంచ జనాభాలో వాటి వాటా దాదాపు 49 శాతం ఉంటుందని వివరించింది. ప్రధానంగా భారత్‌, దక్షిణ కొరియా,అమెరికా దేశాల్లో...తన ప్రయోజనాల కోసం చైనా ఏఐ కంటెంట్‌ను ఉపయోగించవచ్చని అంచనా వేస్తున్నట్లు...మైక్రోసాఫ్ట్‌ వెల్లడించింది. తప్పుడు ప్రచారాలతో ఓటర్లను తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. చైనా కుట్రలను అడ్డుకోకపోతే ఓటర్ల సామర్థ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని మైక్రోసాఫ్ట్ అప్రమత్తం చేసింది.

జనవరిలో జరిగిన తైవాన్‌ అధ్యక్ష ఎన్నికల్లో ఏఐ ఆధారిత తప్పుడు కంటెంట్‌ను చైనా వ్యాప్తి చేసినట్లు మైక్రోసాఫ్ట్‌ ఆరోపించింది. స్టార్మ్‌ 1376 లేదా స్పామౌఫ్లేజ్ అనే చైనా మద్దతు గల సైబర్‌ సంస్థ... ఈ విషయంలో చురుకుగా పనిచేసినట్లు తెలిపింది. కొంతమంది అభ్యర్థుల ప్రతిష్ఠను దెబ్బతీసి, ఓటర్లను ప్రభావం చేసేందుకు...నకిలీ ఆడియో ప్రచారాలు, మీమ్‌లతోసహా AI ఆధారిత కంటెంట్‌ను ఆ సంస్థ ప్రచారం చేసినట్లు మైక్రోసాఫ్ట్‌ తెలిపింది. అందులో ఇరాన్‌ హస్తం కూడా ఉన్నట్లు వెల్లడించింది. విదేశీ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ఒక ప్రభుత్వ సంస్థ ఏఐ కంటెంట్‌ను వినియోగించడం ఇదే తొలిసారి అని మైక్రోసాఫ్ట్‌ పేర్కొంది.

గతనెల దిల్లీలో ప్రధాని నరేంద్రమోదీని కలిసిన మైక్రోసాఫ్ట్‌ సహ-వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ AI సాంకేతికతో ఎదురయ్యే సరికొత్త సవాళ్లపై చర్చించారు. ఏఐ శక్తిమంతమైనదే అయినా...సరైన శిక్షణ లేకుండా అందిస్తే దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని బిల్‌గేట్స్ హెచ్చరించారు. ఏఐ మంచి అవకాశం అయినప్పటికీ...అదేస్థాయిలో సవాళ్లు కూడా పొంచి ఉన్నాయని బిల్‌గేట్స్ అప్రమత్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story