China Ship: మాల్దీవుల్లోకి చైనా పరిశోధక నౌక..

China Ship: మాల్దీవుల్లోకి  చైనా పరిశోధక నౌక..
భద్రతా పరమైన అంశాలపై ఇండియన్ నేవీ ఆందోళన

చైనా పరిశోధక నౌక షియాంగ్‌ యాంగ్‌ హాంగ్‌-03 మాల్దీవుల జలాల్లోకి ప్రవేశించింది. రాజధాని మాలె తీరంలో ఇది లంగరు వేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 4,300 టన్నుల బరువున్న ఈ నౌక హిందూ మహాసముద్రం అడుగు భాగంలోని ఉపరితలంపై పరిశోధన చేయనున్నట్లు సమాచారం. ఫలితంగా ఇక్కడి సముద్ర జలాల్లో జలాంతర్గాముల సంచారానికి అవసరమైన మార్గాలను గుర్తించే అవకాశం బీజింగ్‌కు లభిస్తుందని నావికాదళ వర్గాలు చెబుతున్నాయి.

మాల్దీవులతో భారత్‌కు దౌత్య వివాదం కొనసాగుతున్న వేళ చైనాకు చెందిన పరిశోధక నౌక షియాంగ్‌ యాంగ్‌ హాంగ్‌-03 మాల్దీవుల జలాల్లోకి వచ్చేందుకు సిద్ధమైంది. గ్లోబల్ షిప్-ట్రాకింగ్ డేటా ప్రకారం, చైనా పరిశోధన నౌక షియాంగ్ యాంగ్ హాంగ్‌ మాల్దీవులకు చేరుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ నౌక రాకపై..భారత నావికాదళ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హిందూ మహాసముద్ర జలాల్లో జలాంతర్గాముల సంచారానికి అవసరమైన మార్గాలను గుర్తించే అవకాశం ఈ నౌక వల్ల చైనాకు లభిస్తుందని పేర్కొన్నాయి. దీని వల్ల భద్రతా పరమైన సమస్యలు తలెత్తే అవకాశముందని హెచ్చరించాయి.

షియాంగ్‌ యాంగ్‌ హాంగ్‌-03 నౌక.చైనాలోని థర్డ్‌ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ ఓషనోగ్రఫీకి చెందింది. సముద్రగర్భంలోని పరిస్థితులు, ఖనిజాన్వేషణ, ఇతర అంశాలపై పరిశోధనలు జరపడమే దీని ముఖ్య ఉద్దేశమని చైనా చెబుతోంది. జనవరిలో చైనాలోని సన్యా నుంచి బయలుదేరిన ఈ పరిశోధక నౌక తర్వలో మాల్దీవుల రాజధాని మాలె తీరానికి రానున్నట్టు తెలుస్తోంది. ఈ నౌక మరికొన్ని రోజుల్లోతమ జలాల్లోకి ప్రవేశించినుందని చెప్పిన మాల్దీవులు.. ఎలాంటి పరిశోధనలు నిర్వహించదని తెలిపింది. ఇప్పటికే శ్రీలంక వెళ్లిన ఈ తరహా నౌకలు వాటి కార్యకలాపాలను జలాల వరకే పరిమితం చేయకుండా ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించాయి. ఆ సమయంలో మాల్దీవులు, శ్రీలంక మధ్యనున్న జలాల్లో కదలడంపై భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story