అంతర్జాతీయం

ద్యావుడా.. యాపిల్ ఫోన్ ఆర్డర్ చేస్తే.. ఇదొచ్చిందేంటి

కొత్త ఫోన్ కోసం ఎదురు చూస్తూ వచ్చిన బాక్స్‌ని హడావిడిగా ఓపెన్ చేసింది. తీరా చూస్తే అందులో యాపిల్ ఫోన్‌కి బదులు

ద్యావుడా.. యాపిల్ ఫోన్ ఆర్డర్ చేస్తే.. ఇదొచ్చిందేంటి
X

టెక్నాలజీ మహిమ.. ఫుడ్డూ బెడ్డూ అన్నీ ఆన్‌లైన్‌లో ఆర్డర్.. బెల్ కొడితే డెలివరీ బాయ్ నుంచి పార్సిల్ తీసుకోవడం.. చాలా సిపుల్ అయిపోయింది జీవితం. అందులో ఏం వుంటుంది.. ఆర్డర్ ఇచ్చిందే కదా ఉండాల్సింది. కాదండి బాబు.. చైనాకు చెందిన లియు అనే యువతి ఆపిల్ ఐఫోన్ 12 ప్రో మాక్స్ ఆర్డర్ చేసింది. ఆన్‌లైన్‌లోనే బిల్లు 1500 డాలర్లు (ఇండియన్ కరెన్సీలో రూ.1,10,231) పే చేసింది. కొత్త ఫోన్ కోసం ఎదురు చూస్తూ వచ్చిన బాక్స్‌ని హడావిడిగా ఓపెన్ చేసింది.

తీరా చూస్తే అందులో యాపిల్ ఫోన్‌కి బదులు యాపిల్ జ్యూస్ కనిపించింది. దీంతో ఒక్కసారిగా షాక్ తింది.. వెంటనే తేరుకుని సదరు కంపెనీకి ఫోన్ చేసింది. యాపిల్ అధికారికి వెబ్‌సైట్‌లో ఆర్డర్ చేసినప్పటికీ ఇలా జరగడం ఏంటని మండిపడింది. ఈ విషయాన్ని వివరిస్తూ ఆమె మాట్లాడిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై యాపిల్‌తో పాటు ఎక్స్‌ప్రెస్ మెయిల్ సర్వీసెస్ స్పందిస్తూ కస్టమర్ చెప్పిన ప్రదేశానికి ఫోన్ ఆర్డర్ చేశామని పేర్కొంది.

డెలివరీలో జరిగిన పొరపాటు కాదని తెలుసుకున్నారు. అయితే ఆమె ఇంటి ముందు పార్శిల్ లాకర్‌లో పెట్టిన తర్వాత దుండగులు ఎవరైనా దాన్ని మార్చి ఉండవచ్చని భావిస్తున్నారు. రంగంలోకి దిగిన స్థానిక పోలీసులు ఐఫోన్ ఎలా మాయమైందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. యాపిల్ కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని విచారణ చేపడుతున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.

Next Story

RELATED STORIES