బాస్‌‌కి తన పనితీరు వివరిస్తూ టాయ్‌లెట్ వాటర్‌ని.. వీడియో వైరల్

బాస్‌‌కి తన పనితీరు వివరిస్తూ టాయ్‌లెట్ వాటర్‌ని.. వీడియో వైరల్
తల్లీ అంటున్నారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న

టాయ్‌లెట్‌లో వాటర్ తాగడం ఏంటి.. పిచ్చి కాకపోతే.. ఇంకేం లేదా బాస్ ముందు తను పనిచేస్తుందో లేదో నిరూపించుకోడానికి. బాటిల్‌లో వాటర్ తాగితేనే బ్యాక్టీరియా బోలెడు.. ఈ టాయ్‌లెట్ వాటర్ కాన్సెప్ట్ ఏంటి మరీ వింత కాకపోతే.. బాస్‌కి అయినా బుద్దుండక్కర్లా.. ఆ అమ్మాయి చేస్తానన్నా వద్దని వారించలేదు. అయినా బాస్‌ని మెప్పించడానికి మరో మార్గం లేదా తల్లీ అంటున్నారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసిన వారు. ఇంతకీ ఈ వీడియో చైనా షాంగ్‌డాంగ్‌లో గల ఓ ఫెర్టిలైజర్ కంపెనీలో చోటు చేసుకుంది.

హౌస్ కీపర్‌గా పనిచేస్తున్న ఓ మహిళ తన వర్క్ ఎంత నీట్‌గా ఉంటుందో బాస్‌కి వివరిస్తోంది. అందులో భాగంగానే బాత్‌రూమ్ టాయ్‌లెట్‌లోని వాటర్‌ని గటగటా తాగేసింది. బాస్‌తో సహా అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. ఆ తరువాత బాస్ ఆమె పని తీరుని ప్రశంసించారు. ఏమ్మా.. ఇంత రిస్క్ తీసుకోవటం అవసరమా.. మోషన్స్, వామ్టింగ్స్‌లాంటివి అయితే ఆస్పత్రి బెడ్ మీద ఉండాలి.. బాస్ వచ్చి సానుభూతి కురిపిస్తాడే తప్ప సాయం చేయలేడు.. ఎవరూ ఇలాంటి తప్పులు చేయకండి అంటూ హెచ్చరిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story