కరోనా కాలంలో కంపెనీ లాభాలు.. ఉద్యోగులకు కార్లు గిప్ట్

కరోనా కాలంలో కంపెనీ లాభాలు.. ఉద్యోగులకు కార్లు గిప్ట్
జియాంగ్జీ వెస్ట్ దజియై ఐరన్ అండ్ స్టీల్ కార్పొరేషన్ తమ ఉద్యోగులకు 4,116 కార్లను బహుమతిగా ఇచ్చింది.

కరోనా వైరస్ వచ్చి చాలా కంపెనీలను మూత పడేలా చేసింది. మరి కొన్ని కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించింది. ఈ పరిస్తితుల్లో ఓ కంపెనీ లాభాల బాట పట్టిందంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. అందుకు ప్రతిగా ఉద్యోగులకు కంపెనీ కార్లు బహుకరించి ఉద్యోగుల పట్ల కంపెనీకి ఉన్న నిబద్ధతను తెలియజేసింది. అది కూడా కరోనా వైరస్‌ను ప్రపంచం మీదకు వదిలినట్టుగా చెప్పుకుంటున్న చైనాలో జరిగింది. జియాంగ్జీ వెస్ట్ దజియై ఐరన్ అండ్ స్టీల్ కార్పొరేషన్ తమ ఉద్యోగులకు 4,116 కార్లను బహుమతిగా ఇచ్చింది.

ఈనెల 1న ఈ కార్యక్రమాన్ని భాతీగా నిర్వహించింది. వరుసగా ఐదో ఏడాది కూడా కంపెనీ లాభాల బాట పట్టిందన్న సంతోషంతో యాజమాన్యం తమ సిబ్బందికి మరిచిపోలేని గిప్ట్‌ని అందించి ఉద్యోగుల పట్ల తనకున్న కృతజ్ఞతను చాటుకుంది. అయితే అవేవో సాదా సీదా కార్లు కాదు.. కాస్లీ కార్లు.. ఈ మొత్తం కార్లు కొనుగోలు చేయడానికి కంపెనీ ఖర్చు పెట్టి అక్షరాల రూ.540 కోట్లు. 1,183 ఖరీదైన FAW వోక్స్‌వ్యాగన్ మాగోటన్ కార్లు, 2,933 జియాంగ్లింగ్ ఫోర్డ్ టెరిటరీ కార్లను అందించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Tags

Read MoreRead Less
Next Story