Mysterious Object: అవును అది భారత్ కు చెందినదే

Mysterious Object: అవును అది భారత్ కు చెందినదే
భారత రాకెట్ శిధిలంగా ప్రకటించిన ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ

ఆస్ట్రేలియా బీచ్‌ లో కనిపించి ఆశ్చర్యపరిచిన వింత వస్తువు గురించి వివరాలు ప్రకటించింది ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ. ఇది ఒక పాత పోలార్ సెటిలైట్ లాంచ్ వెహికిల్ (PSLV) కి సంబంధించినదిగా ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం పశ్చిమ ఆస్ట్రేలియా లోని గ్రీన్ హెడ్ పట్టణ తీరంలో ఉన్న జురియన్ బే బీచ్‌కు కొట్టుకు వచ్చిన ఓ వస్తువు పలు అనుమానాలకు తావిచ్చింది. ఆ వింత వస్తువు చంద్రయాన్-3 ని తీసుకెళ్లిన ఎల్వీఎం రాకెట్‌కు సంబంధించిన శకలమని చాలా మంది భావించారు. చంద్రయాన్-3 ఆస్ట్రేలియా గగనతలం మీద నుంచి వెళ్లింది అంటూ కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవ్వటంతో అందరూ ఇది చంద్రయాన్ కు సంబంధం ఉన్న వస్తువు గా భావించారు. ఈ వస్తువు 2.5 మీటర్ల వెడల్పు, 2.5-3 మీటర్ల వెడల్పు కలిగి ఉంది.

మరోవైపు వివరాలు పూర్తిగా తెలియకపోవడంతో దానికి దూరంగా ఉండాలని, ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించాలని ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ ప్రకటించింది. అది విదేశీ స్పేస్ ఏజెన్సీకి సంబంధించిన వస్తువు అయి ఉంటుందని ప్రాధమిక అంచనాకు వచ్చింది. ఆ వస్తువుకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ ట్వీట్ చేసింది. అయితే ఇప్పుడు తాజాగా మరో ట్వీట్ చేసింది. అది భారత రాకెట్ నుండి వచ్చిన శిధిలాలుగా ప్రకటించింది.

PSLV నాలుగు దశలను కలిగి ఉంటుంది. ఇందులో మూడవ దశలో విసిరివేయబడిన వస్తువుగా దీనిని చెబుతున్నారు సైంటిస్ట్లు. రెండు దేశాలు దాని గుర్తింపును నిర్ధారించడానికి, అంతరిక్ష ఒప్పందాల ప్రకారం తమ బాధ్యతలను నిర్వహిస్తున్నాయని ఈ విషయంలో ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ, ఇస్రోతో కలిసి పనిచేస్తోందని, ఐక్యరాజ్యసమితి అంతరిక్ష ఒప్పందాల క్రింద బాధ్యతలను పరిగణనలోకి తీసుకొని తదుపరి కార్యక్రమం నిర్వహిస్తారని పేర్కొంది. ఒకవేళ ఎవరైనా మరిన్ని అనుమానాస్పద శిధిలాలను గుర్తించినట్లయితే వెంటనే స్థానిక అధికారుల ద్వారా ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీకి తెలియజేయాలని ప్రకటించింది.

Tags

Read MoreRead Less
Next Story