అంతర్జాతీయం

మళ్లీ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు.. క్రిస్మస్ వేడుకలు రద్దు..

కరోనా వైరస్‌ విజృంభణ మళ్లీ మొదలైంది. ఈ కరోనా కారణంగా ప్రధానమంత్రి క్రిస్మస్‌ వేడుకలపై కఠినమైన ఆంక్షలు విధించారు.

మళ్లీ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు.. క్రిస్మస్ వేడుకలు రద్దు..
X

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తోంది. కరోనా వైరస్‌ విజృంభణ మళ్లీ మొదలైంది. ఇంగ్గాండ్‌లో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తున్ననేపథ్యంలో ఇంగ్లాండ్‌లో క్రిస్మస్ వేడుకలు రద్దు చేశారు. ఇంగ్లాండ్ రాజధాని లండన్‌తో సహా పశ్చిమ, ఆగ్నేయ ఇంగ్లాండ్‌లో క్రిస్మస్‌ వేడుకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ప్రకటించారు. ఆ ఆంక్షలు ఆదివారం ఉదయం నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.

ఇంగ్లాండ్‌ ప్రజలు శతాబ్దాలుగా క్రిస్మస్ వేడుకలను ఘనంగా సెలబ్రెట్ చేసుకుంటున్నారు. కరోనా కారణంగా ప్రధానమంత్రి బోరిక్ క్రిస్మస్‌ వేడుకలపై కఠినమైన ఆంక్షలు విధించారు. ప్రస్తుతం లండన్‌లో టైర్-3 ఆంక్షలు అమలువుతున్నాయి. తాజాగా లండన్ నగరం లాక్ డౌన్‌ను పోలిన టైర్ 4 నిబంధనల్లోకి వెళ్లిపోయింది.

Next Story

RELATED STORIES