ట్రంప్ దంపతులకు కరోనా..

ట్రంప్ దంపతులకు కరోనా..

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష దంపతులు కరోనా వైరస్‌ బారినపడ్డారు. కరోనా టెస్టుల్లో పాజిటివ్‌ వచ్చినట్టు.. అమెరికా ప్రెసిడెంట్‌ డొనాల్డ్ ట్రంప్‌ ట్విట్టర్ ద్వారా తెలిపారు. తన భార్య మెలానియా కూడా.. కరోనా బారినపడ్డట్టు పేర్కొన్నారు. పాజిటివ్‌ వచ్చిన నేపథ్యంలో.. క్వారంటైన్‌లోకి వెళుతున్నట్టు ట్రంప్ ట్వీట్ చేశారు.

ట్రంప్ సలహాదారుల్లో ఒకరికి కరోనా సోకడంతో అధ్యక్ష దంపతులు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. తన సలహాదారు హాప్ హిక్స్‌ విరామం లేకుండా విదుల్లో నిరంతరం నిమగ్నమై ఉండటంతో ఆయనకు కొవిడ్‌-19 వచ్చిందని.. ఇది చాలా విచారకరమని ట్రంప్‌ ట్వీట్ చేశారు. అధ్యక్ష ఎన్నికలకు కేవలం నెల రోజుల వ్యవధిలో.. ట్రంప్ కరోనా బారినపడటం విజయావకాశాలపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

కొద్ది రోజుల క్రితం అధ్యక్ష ఎన్నికల చర్చల్లోనూ.. ప్రెసిడెంట్‌ ట్రంప్‌.. డెమోక్రాట్‌ అభ్యర్థి జోబిడెన్ మధ్య కరోనాపై వాడివేడిగా చర్చ జరిగింది. తాను తీసుకున్న చర్యలవల్లే కరోనా అదుపులో ఉందని.. ట్రంప్ అన్నారు. అదే సమయంలో... కరోనాను నియంత్రించడంలో ట్రంప్ విఫలయ్యారని జో విమర్శించారు. అమెరికాలో కరోనా విజృంభిస్తున్నప్పుడు కూడా.. దేశంలో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ను ట్రంప్ వ్యతిరేకించారు. అధికారిక కార్యక్రమాల్లోనూ.. చాలా సందర్భాల్లో మాస్కులు లేకుండానే ట్రంప్‌ తిరిగారు. లాక్‌డౌన్‌ను ఎప్పుడు తొలగించాలా అని.. తొందరపడ్డారు ట్రంప్‌. ఇప్పుడు స్వయంగా ఆయనే కరోనా బారిన పడ్డారు. దీంతో అగ్రరాజ్య అధ్యక్షులైనా.. సామాన్యులైనా కరోనా ఎవరూ అతీతులు కాదని.. మరోసారి స్పష్టమైంది.

Tags

Read MoreRead Less
Next Story