అగ్రరాజ్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కొవిడ్‌ కేసులు!

అగ్రరాజ్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కొవిడ్‌ కేసులు!
కరోనా వైరస్‌ విజృంభణతో అమెరికా అల్లాడుతోంది. రోజురోజుకీ పెరుగుతున్న కొవిడ్‌ కేసులు అగ్రరాజ్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

కరోనా వైరస్‌ విజృంభణతో అమెరికా అల్లాడుతోంది. రోజురోజుకీ పెరుగుతున్న కొవిడ్‌ కేసులు అగ్రరాజ్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.గడిచిన 24గంటల్లోనే దాదాపు 3 లక్షల కొత్త కేసులు రావడం తీవ్ర కలవరం రేపుతోంది. తాజా గణాంకాలను కలుపుకొంటే అమెరికాలో ఇప్పటివరకు 21.8 మిలియన్ల పాజిటివ్‌ కేసులు. 3 లక్షల 68 వేల మరణాలు సంభవించాయి.

దేశంలో నెలకొన్న ఆరోగ్య సంక్షోభాన్ని తొలగించేందుకు అక్కడి ప్రభుత్వం గతేడాది డిసెంబర్‌ మధ్యలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను చేపట్టింది. అయినా కరోనా అదుపులోకి రాకపోవడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేయనున్నట్టు అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ అధికార ప్రతినిధి తెలిపారు. అమెరికాలో ఇప్పటి వరకు 6.6మిలియన్ల మందికి తొలి ఇంజెక్షన్‌ ఇచ్చారు. మరికొంత మంది ఈ వారంలో రెండో డోసును అందుకోనున్నారు.

అమెరికాలో కరోనా మహమ్మారి సృష్టించిన విలయంతో అత్యంత దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. మృతుల అంత్యక్రియలకు శ్మశాన వాటికల్లోనూ చోటుదక్కని దుస్థితి నెలకొంది. అటు కరోనా సోకిన జనం చేరుతుండటంతో ఆస్పత్రులు రద్దీగా మారాయి. కొన్ని ఆస్పత్రులయితే పేషంట్లను చేర్చుకునేందుకు నిరాకరిస్తున్నాయి..ప్రపంచంలోనే అత్యాధునిక వైద్య సౌకర్యాలు కలిగిని అమెరికాకు ఈ పరిస్థితి పెద్ద తలనొప్పిగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story