అత్యంత ఖరీదైన నగరాల్లో హైదరాబాద్‌

అత్యంత ఖరీదైన నగరాల్లో హైదరాబాద్‌
దేశంలోని జాబితా ముంబయి అగ్రస్థానంలో ఉంటే ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ,చెన్నై,బెంగళూరు,కోల్‌కతా,పుణె ఉన్నాయని మెర్సర్స్‌ 2023 కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సర్వే నివేదిక విడుదల చేసింది.

భారత్‌లో విదేశీయులకు అత్యంత ఖరీదైన నగరాల్లో హైదరాబాద్‌కూ చోటు లభించింది. దేశంలోని జాబితా ముంబయి అగ్రస్థానంలో ఉంటే ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ,చెన్నై,బెంగళూరు,కోల్‌కతా,పుణె ఉన్నాయని మెర్సర్స్‌ 2023 కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సర్వే నివేదిక విడుదల చేసింది. ప్రతి నగరంలో వసతి,రవాణా,ఆహారం,దుస్తులు,గృహోపకరణాలు, వినోదం వంటి 200 అంశాలకు అయ్యే ఖర్చును పరిగణనలోకి తీసుకుని.. ఈ సర్వేను చేశారు.

ప్రపంచం మొత్తం మీద ఖరీదైన నగరాల్లో ముంబయికి 147వ స్థానం దక్కింది.ఢిల్లీ 169, చెన్నై 184, బెంగళూరు 189, హైదరాబాద్‌ 202, కోల్‌కతా 211, పుణె 213వ స్థానాల్లో నిలిచాయి. ఇక అంతర్జాతీయంగా హాంకాంగ్‌, సింగపూర్‌, జూరిచ్‌ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. చాలా తక్కువ ఖరీదైన ప్రాంతాల్లో పాకిస్థాన్‌లోని కరాచీ, ఇస్లామాబాద్‌ ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story