Britain: మాస్క్‌ను పక్కన పెట్టారు.. మళ్లీ ప్రమాదంలో పడ్డారు..

Britain: మాస్క్‌ను పక్కన పెట్టారు.. మళ్లీ ప్రమాదంలో పడ్డారు..
Britain: గతేడాది ఈ సమయానికి కరోనా అనే పేరు వింటేనే అందరిలో వణుకొచ్చేది.

Britain: గతేడాది ఈ సమయానికి కరోనా అనే పేరు వింటేనే అందరిలో వణుకొచ్చేది. కానీ ఇప్పుడు దాని ఊసే మర్చిపోయారు ప్రజలు. అలా అని కరోనా వ్యాప్తి ఆగిపోయిందని కాదు.. రోజుకు వేలు కాకపోయినా వందల కొద్దీ కేసులు అయినా మన రాష్ట్రంలో నమోదు అవుతూనే ఉన్నాయి. కానీ బ్రిటన్‌లో పరిస్థితి అలా లేదు.. జులైలో కేసులు కాస్త తగ్గి.. వ్యాక్సిన్‌ను ప్రవేశ పెట్టడంతో రష్యా ప్రభుత్వం అన్నింటికీ అనుమతి ఇచ్చేసింది.. అక్కడే అది తప్పు చేసింది..

జులై నుండి బ్రిటన్‌లో దాదాపు అందరూ మాస్క్ పెట్టుకోవడం మానేశారు. అన్ని కార్యకలాపాలకు అక్కడి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. స్కూళ్లు, ఆఫీసులు, పబ్లిక్ ఏరియాలు అన్నీ తెరుచుకున్నాయి. అంతే కరోనా వ్యాప్తిని ఇంక అడ్డుకున్న వారే లేరు. గత రెండు వారాలుగా కరోనా వ్యాప్తి మరింత పెరిగింది. రోజుకు 35 నుండి 40 వేల కేసులు నమోదవ్వడం మొదలయ్యింది. ఇక ఈవారం రికార్డు స్థాయిలో ఒకేరోజు 50 వేల మంది కరోనా బారిన పడ్డట్లు తేలింది.

కరోనా కేసుల విషయంలోనే కాదు.. కరోనా మరణాల్లో కూడా రష్యా ముందంజలో ఉంది. రోజుకు కనీసం 100 మంది కోవిడ్ వల్ల మరణిస్తున్నారు. కోవిడ్ మృతుల విషయంలో యూరోప్‌లో రష్యా తర్వాత స్థానంలో ఉంది బ్రిటనే. ఇతర దేశాలతో పోల్చితే బ్రిటన్‌లో కొవిడ్ వ్యాప్తి అధికంగా ఉంది. పాజిటివ్‌ కేసులు, ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య, మరణాలు ఎక్కువగా ఉన్నాయని వైద్య నిపుణులు కూడా వెల్లడించారు.

స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోవడంతో పిల్లలు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు. అక్కడ సూళ్లకు వెళ్తున్న విద్యార్థులు చాలావరకు వ్యాక్సిన్ తీసుకోనివారే. అందుకే వారిలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. పిల్లలు కాస్త వీక్‌గా ఉన్నా వారి ప్రాణానికి ప్రమాదమే అంటున్నారు వైద్యులు. అన్నింటికంటే ముందుగా కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్‌ను ప్రారంభించిన బ్రిటన్ దేశం మళ్లీ ఇలా అయిపోవడం బాధాకరం అంటున్నారు ప్రజలు.

బ్రిటన్ ప్రధానంగా ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా టీకాపైనే ఆధారపడింది. బూస్టర్ డోసులు కూడా అక్కడ చాలాకాలం క్రితమే ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు అక్కడ 41 శాతం మంది బూస్టర్ డోసుల్ని తీసుకున్నారు. పైగా వ్యాక్సిన్ తీసుకున్నా, తీసుకోకపోయినా బ్రిటన్.. మాస్క్ పెట్టుకోవడానికి ఎప్పుడూ వ్యతిరేకంగా ఉండేది. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత అసలు అక్కడ మాస్క్‌నే మర్చిపోయారు.

ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందన్న ఉద్దేశ్యంతో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ లాక్‌డౌన్ ప్రస్తావనే తీసుకురావట్లేదు. కానీ అప్పుడు వ్యాప్తి చెందుతున్న కరోనా కంటే ఇప్పుడు మరింత అడ్వాన్స్‌డ్‌గా మారిన డెల్ట్ ప్లస్ వైరస్ మరింత ప్రమాదకరం. అందుకే దీని వ్యాప్తికి కారణాలు కనుక్కొని ఎలాగైనా అరికట్టాలని అక్కడి పరిశోధకులు భావిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story