బిల్లు కంటే టిప్పే ఎక్కువ.. రూ.2 లక్షలు మరి..

బిల్లు కంటే టిప్పే ఎక్కువ.. రూ.2 లక్షలు మరి..
అయితే ఓ కస్టమర్ ఆ రెస్టారెంట్ యజమానికి నిజంగా దేవుడిలా కనిపించాడు..

కుటుంబ సమేతంగా రెస్టారెంట్‌కి వెళ్లి ఆర్డ్రర్ ఇచ్చినవన్నీ అయిదు నిమిషాల్లో తెచ్చి వేడి వేడిగా వడ్డించిన సర్వర్‌కి టిప్ ఇవ్వాలంటే ఎంత బాధో కొందరికి. అదే బిల్లు వేలల్లో వచ్చినా ఈజీగా ఇచ్చేస్తారు.. కానీ ఓ రూ.20లు టిప్పివ్వాలంటే మాత్రం ప్రాణం పోతుంది. అయితే ఓ కస్టమర్ ఆ రెస్టారెంట్ యజమానికి నిజంగా దేవుడిలా కనిపించాడు.. టిప్ రూ.2.21 లక్షలు ఇచ్చాడు మరి. అసలే కరోనా కాలం.. బిజినెస్ లేక వచ్చిన కస్టమర్‌నే దేవుడిలా చూసుకుంటున్నారు రెస్టారెంట్ యాజమానులు, బార్ ఓనర్లు..

ఈ నేపథ్యంలో అమెరికాలోని క్లేవేల్యాండ్‌లోని ఓ రెస్టారెంట్ యజమాని బ్రెంన్డాన్ రింగ్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన బిల్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బ్రెంన్డాన్ మాట్లాడుతూ.. 'మా నైట్ టౌన్ రెస్టారెంట్‌కు వచ్చిన కస్టమర్ 7.02 డాలర్లు (రూ.515) విలువ చేసే బీరు తాగారు. అయితే అదనంగా మరో 3 వేల డాలర్లు (రూ.2.21 లక్షలు) టిప్ ఇస్తున్నట్లు ఆ బిల్లులో రాశారు. అది చూడగానే మా సిబ్బంది, నేను మొదట ఆశ్చర్యపోయాం.. ఆ తరువాత వెంటనే పొరపాటున రాసారేమో అని భావించి అడిగాము.

దానికి ఆయన మీ రెస్టారెంట్‌కు కస్టమర్లు మరింత ఎక్కువగా వచ్చినప్పుడు మళ్లీ కలుద్దాం అని నవ్వుతూ వెళ్లిపోయారని తెలిపాడు. కాగా కరోనా కష్టకాలంలో దేవుడిలా ఆదుకున్న కస్టమర్‌‌కి మనసులోనే కృతజ్ఞతలు తెలిపాడు బ్రెంన్డాన్. ఇప్పటివరకు ఆదుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఆయన ఎంతో దయతో మమ్మల్ని ఆదుకున్నారు. ఇబ్బందుల్లో ఉన్న తమ రెస్టారెంట్‌ని ఆదుకునేందుకే అతడు మాకు ఇంత టిప్ ఇచ్చాడని పేర్కొన్నారు. లోకంలో మంచి ఇంకా మిగిలే ఉందనడానికి ఇదే ఉదాహరణ అని ఆనందభాష్పాలు నిండిన కళ్లతో అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story