Florida: విమానం మునిగిపోయినా.. బతికి బయటపడ్డ పైలెట్.. ఎలాగంటే..
Florida: ఒక విమానం వేగంగా వచ్చి నీటిలో పడిందట. ఇక అందులో ఉన్నవారి ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వలేం.

Florida (tv5news.in)
Florida: ఒక విమానం వేగంగా వచ్చి నీటిలో పడిందట. ఇక అందులో ఉన్నవారి ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వలేం. అసలు ఇలాంటి ఎన్నో ఘటనల్లో విమానం దాఖలాలు దొరకడానికి కూడా చాలా సమయం పడుతుంది. కానీ ఫ్లోరిడాలో మాత్రం విమానం సముద్రంలో పడిపోయింది. పైలెట్ మాత్రం బతికి బయటపడగలిగాడు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.
ఫ్లోరిడా రాష్ట్రంలోని గల్ఫ్ తీరం. అక్కడ కస్టమ్స్ అధికారులు ఎప్పటిలాగానే విధులు నిర్వహిస్తున్నారు. గస్తీలో ఉన్నవారికి సముద్రం మధ్యలో ఒక వ్యక్తి నిలబడి ఉన్నట్టుగా కనిపించింది. పైగా అతడు నిలబడి ఉన్నది ఒక మునిగిపోతున్న విమానం మీద అని వారు గుర్తించారు. అంతే వెంటనే షిప్‌లో అక్కడికి చేరుకొని అతడి ప్రాణాలు కాపాడారు.
సముద్రంలో ఉన్న ఆ విమానం దాదాపు కాక్‌పిట్ వరకు మునిగిపోయి ఉంది. అందులో నుండి ఎలాగోలా బయటపడిన దాని పైలట్.. మునిగిపోతున్న ఆ విమానం మీద నిస్సహాయంగా నిలబడి ఉన్నాడు. కస్టమ్స్ అధికారులు తనని సమయానికి గుర్తించడం వల్ల ఆ వ్యక్తి ప్రాణాలు నిలబడ్డాయి. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. కస్టమ్స్ అధికారుల సమయస్పూర్తిని నెటిజన్లు అభినందిస్తున్నారు.
RELATED STORIES
Manchu Vishnu: మంచు విష్ణుతో జెనీలియా.. క్రేజీ పోస్ట్ వైరల్..
23 May 2022 1:30 PM GMTKushi 2022: శరవేగంగా 'ఖుషి' షూటింగ్.. ఇంతలోనే మరో అప్డేట్..
23 May 2022 12:15 PM GMTMajor: 'మేజర్' మూవీ టీమ్ సూపర్ ప్లాన్.. ఫస్ట్ టైమ్ ఇలా..
23 May 2022 10:39 AM GMTPayal Rajput: స్టేజ్‌పైనే బాయ్‌ఫ్రెండ్‌కు లిప్ లాక్ ఇచ్చిన హీరోయిన్..
22 May 2022 2:45 PM GMTBalakrishna: బాలయ్య సరసన బిగ్ బాస్ విన్నర్.. కీలక పాత్రలో మరో యంగ్...
22 May 2022 2:13 PM GMTRajasekhar: 'శేఖర్' సినిమాపై స్టే.. ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన హీరో..
22 May 2022 1:10 PM GMT