Congo Virus: ఫ్రాన్స్‌లో కాంగో వైరస్‌ కలవరం..

Congo Virus: ఫ్రాన్స్‌లో కాంగో వైరస్‌ కలవరం..
ఇరాక్ ను వణికించిన కాంగో వైరస్… ...బ్రిటన్‌ అప్రమత్తం

ఇరాక్‌ను వణికించిన ప్రాణాంతక కాంగో ఫీవర్‌ వైరస్‌ ఫ్రాన్స్‌కు వ్యాపించింది. స్పెయిన్‌ సరిహద్దులో తొలి కేసు గుర్తించినట్లు ఫ్రాన్స్‌ వైద్య వర్గాలు వెల్లడించాయి. సాధారణంగా కాంగో వైరస్ జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. ఆఫ్రికా, మధ్య ఆసియా దేశాల్లో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు పశ్చిమ యూరప్‌, స్పెయిన్‌లోనూ గుర్తించారు. వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు ఈ వైరస్‌ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ప్రధానంగా జంతువుల్లో కనిపించే.... రక్తం పీల్చే పేలు ద్వారా విస్తరిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన తొమ్మిది ప్రాణాంతక వ్యాధుల్లో కాంగో ఫీవర్‌ వైరస్‌ కూడా ఉంది. స్పెయిన్‌లో 2013 నుంచి ఆగస్టు 2022 మధ్య కాలంలో 12 కేసులు నమోదుకాగా.. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇరాక్‌లో కాంగో వైరస్‌ బారిన పడి గతేడాది 19 మంది మృత్యువాత పడ్డారు. ఫ్రాన్స్‌లో కాంగో వైరస్‌ కేసు నమోదైన నేపథ్యంలో పొరుగు దేశం బ్రిటన్‌ అప్రమత్తమైంది. ఫ్రాన్స్‌లో వైరస్‌ సోకే అవకాశం ఉన్న ప్రాంతాలకు వెళ్లొద్దని బ్రిటన్‌ పర్యాటకులను కోరింది.


గత రెండు సంవత్సరాల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ గురించి ఎప్పుడూ తలుచుకున్న వణుకు పుడుతుంది. అంతలా మానవాళిని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీసేలా చేసింది. ఇలాంటి రకరకాల వైరస్ లు వివిధ కారణాల వలన వ్యాప్తి చెందుతూ మనుషుల ప్రాణాలను తీసుకుంటున్నారు. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఫ్రాన్స్ లో కాంగో వైరస్ మొదటి కేసు నమోదు అయిందట. ఈ కాంగో వైరస్ ఇటీవల ఇరాక్ మరియు స్పెయిన్ లలో మొదలైన సంగతి తెల్సిందే. దీని వలన ఇరాక్ లో మొత్తం 19 మంది ప్రాణాలు వదిలారు. స్పెయిన్ లోనూ 19 కేసులు నమోదు అయినా ఒక మరణం కూడా సంభవించలేదు. ఈ వైరస్ ముఖ్యంగా జ్ఞాతువుల్లోని రక్తం పీల్చే పేలు ద్వారా వ్యాపిస్తునట్లు కనుగొన్నారు. ఈ వైరస్ ఎబోలా జాతికి చెందిన వైరస్ గా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వైరస్ సోకినా వారు శ్వాస సరిగా ఆడకపోవడం, తలనొప్పి, వాంతులు, తీవ్ర జ్వరం లాంటివి లక్షణాలు గా ఉంటాయి.


Tags

Read MoreRead Less
Next Story