Kenya : కెన్యాను ముంచెత్తిన భారీ వర్షాలు

38 మంది మృతి

తూర్పు ఆఫ్రికా దేశమైన కెన్యాని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాల నేపథ్యంలో దేశంలో ఇప్పటివరకు 38 మంది మృతువాత పొందారు. గడిచిన నాలుగైదు రోజుల నుండి దేశంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల కారణంగా దేశంలోని అనేక నదులు ప్రమాదకరస్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి.

నదులలో నీరంతా నివాస ప్రాంతంలోకి వస్తుందడంతో జనం ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా నది ప్రవాహక ప్రాంతాలలో అనేక ఇల్లు నీట మునగడంతో లక్షలాదిమంది నిరాశ్రులాయరని అక్కడ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో దేశంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి అక్కడ వారికి కావలసిన వసతులను ఏర్పాటు చేస్తున్నారు. సుమారు లక్ష మందికిపైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. భారీ వర్షాలు దేశవ్యాప్తంగా కనీసం 23 కౌంటీలను ప్రభావితం చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

కొన్ని ప్రదేశంలో వరద నీరు ఎక్కువగా ఉండటంతో వారికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. దీనితో వారు బిక్కుబిక్కుమంటూ వర్షపు నీటిలో బతికేస్తున్నారు. దేశంలోని తీబా నదికి వరదలు రావడంతో సమీప ప్రాంతాల్లోనే అనేక ఇళ్లలోకి, అలాగే వ్యాపార సంస్థల్లోకి నీరు చేరడంతో ప్రజల అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ వరదలు నేపథ్యంలో దేశంలోని అనేక రోడ్డు రవాణా మార్గాలు దెబ్బతిన్నాయి. వరదల కారణంగా దేశంలో ప్రస్తుతానికి 38 మంది ప్రాణాలు కోల్పోయారని కెన్యా రెడ్ క్రాస్ సొసైటీ పరిధిలోని అధికారులు తెలిపారు. చాలా ప్రాంతాలలో పంటలు నీటిమునగగా.. చాలా చోట్ల పశువులకు సంబంధించిన మరణాలు జరిగాయని అధికారులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story