Emmanuel Macron: రష్యా ఏకాకి అని జీ20 తేల్చింది

Emmanuel Macron:  రష్యా ఏకాకి అని జీ20 తేల్చింది
దిల్లీ డిక్లరేషన్‌పై ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌

జీ20 సదస్సులో పాల్గొన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ సదస్సులో తీసుకున్న నిర్ణయాలు.. దిల్లీ డిక్లరేషన్​ పై తన అభిప్రాయలు తెలిపారు. జీ20లో న్యూదిల్లీ డిక్లరేషన్‌ ద్వారా రష్యాను ఒంటరి చేయడాన్ని ధ్రువీకరించారని పేర్కొన్నారు. ఇది ఆ దేశానికి దౌత్యపరమైన విజయం కాదని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని తప్పు పట్టిన మెక్రాన్.. శాంతి, ఐకమత్యం కోసం ప్రధాని మోదీ మాటలకు ధన్యవాదాలు చెప్పారు.

పరస్పరం ఆసక్తి ఉన్న అంశాలపై కలిసి పనిచేద్దామని, వివిధ దేశాధినేతలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించారు. ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపరచుకునేందుకు ఉమ్మడిగా కృషి చేయాలని సంకల్పించారు. జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు దిల్లీకి వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ తో మోదీ భేటీ అయ్యారు.


ఈ సందర్భంగా వేర్పాటువాదాన్ని ప్రోత్సహించే రీతిలో కెనడాలో ఖలిస్థాన్ అనుకూలవాదులు వ్యక్తం చేస్తున్న నిరసనలపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. అందుకు స్పందించిన ట్రూడో తమ దేశంలో ఓ వర్గం ఆధ్వర్యంలో సాగే కార్యకలాపాలు..ఆ వర్గం మొత్తానికి లేదా కెనడాకు ప్రాతినిధ్యం వహించబోవని స్పష్టం చేశారు. భారత్‌ను ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన ఆర్థిక వ్యవస్థగా కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో అభివర్ణించారు. తమ దేశానికి భారత్​ ముఖ్యమైన భాగస్వామి అని అన్నారు. జీ20 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో భారత్‌ వచ్చిన ట్రూడో.. ఆదివారం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య సంబంధాలతోపాటు ఆయా రంగాలపై చర్చించినట్లు ప్రధాని మోదీ సైతం ట్వీట్‌ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జస్టిన్‌ ట్రూడో.. కెనడాలో ఖలిస్థానీ నిరసనలపై చర్చించుకున్నట్లు చెప్పారు.భారత్ - ఫ్రాన్స్ సంబంధాలను సమున్నత శిఖరాలకు చేర్చేందుకు వివిధ అంశాలపై మెక్రాన్ తో ఫలప్రదంగా చర్చించినట్లు మోదీ తెలిపారు.


రెండు దేశాల మధ్య రక్షణరంగ సంబంధాలను బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. వాణిజ్యం,మౌలిక సదుపాయాలపై తుర్కియేతో, వ్యవసాయం, సాంకేతిక రంగాల్లో సహకారంపై బ్రెజిల్ తో సమాలోచనలు జరిపినట్టు వివరించారు. భారత్‌-ఫ్రాన్స్‌ సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా చర్చలు జరిగాయని ప్రధాని తెలిపారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు కొత్త శిఖరాలకు చేరుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఎక్స్​(ట్విట్టర్) వేదికగా ప్రధాని మోదీ తెలిపారు. మరోవైపు.. ప్రపంచమంతా ఒకే కుటుంబమని మోదీతో భేటీ అనంతరం ఫ్రాన్స్​ అధ్యక్షుడు మెక్రాన్.. ట్వీట్ చేశారు. భారత్​-ఫ్రాన్స్ దేశాల మధ్య రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేస్తామని ఇరుదేశాలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. అధునాతన రక్షణ సాంకేతికత, అభివృద్ధి విషయంలో పరస్పరం పాలుపంచుకుంటామని పేర్కొన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story