మియామి కోర్టుకు హాజరైన ట్రంప్

మియామి కోర్టుకు హాజరైన ట్రంప్
తదుపరి విచారణ జూన్ 27 కు వాయిదా

అధికారిక రహస్య పత్రాలను తన ఇంట్లో దాచిన కేసులోఅమెరికాలో మాజీ అధ్యక్షులు కోర్టుకు హాజరైయ్యారు. ఈ సందర్బంగా ట్రంప్ తను నిర్దోషి అని కోర్టులో పేర్కొన్నారు. ట్రంప్ తన పదవీ కాలం ముగిసిన తరువాత కూడా అధికారిక రహస్య పత్రాలను తన వద్దే ఉంచుకున్నారని, వాటిని తీసుకోవడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను అడ్డుకున్నారనే అభియోగాలను ఎదుర్కొంటున్నారు. ఆ మేరకు ఆయనపై కేసు దాఖలైంది.

మంగళవారం మయామి కోర్టులో ఈ కేసుపై విచారణ జరిగింది. అయితే కోర్టుకు హాజరయే ముందు ట్రంప్ తన సోషల్ మీడియాలో ఈరోజును దేశం మొత్తానికి విషాదకరమైన రోజుగా అభివర్ణించారు. గతంలో కూడా ట్రంప్ ఇది అమెరికా చరిత్రలో చీకటి రోజని, తనపై ఆరోపణలు రాజకీయ కుట్ర అని పేర్కొన్నారు. రహస్య పత్రాలను దాచినందుకు గానూ మొత్తం 37 నేరారోపణలు ఎదుర్కొంటున్నారు ట్రంప్. అందులో గూఢచర్యం, నిబందనల ఉల్లంఘన, రక్షణ సమాచారాన్ని అనధికారికంగా కలిగి ఉండటం, న్యాయన్ని అడ్డుకోవడం లాంటి తీవ్ర నేరాలు ఉన్నాయి.

భారతీయ కాలమానం ప్రకారం 12.30 గంటల ప్రాంతంలో ఆయన మియామీ కోర్టుకు హాజరయయారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. విచారణ సమయంలో ట్రంప్ వేలిముద్రలను మార్షల్స్ తీసుకున్నారు. అలాగే, వారు ట్రంప్‌కు గుర్తింపును, ఫోటోను కోర్ట్ రికార్డు లలోకి అప్లోడ్ చేస్తారు కానీ వాటిని ప్రజలకు విడుదల చేయరు.

కాగా, అమెరికా చరిత్రలోనే ఇలాంటి తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటూ.. కోర్టుకు హాజరైన మాజీ అధ్యక్షుడు కూడా డొనాల్డ్ ట్రంప్ కావడం గమనార్హం. ట్రంప్ కోర్టుకు హాజరు కావడం ఈ మధ్య కాలంలో ఇది రెండోసారి. ఓ పోర్న్ స్టార్ అనైతిక ఒప్పందాల వ్యవహారంలో ఏప్రిల్‌లో ఆయన న్యూయార్క్ కోర్టు ఎదుట హాజరయ్యారు. తాజాగా, కీలక రక్షణ శాఖకు సంబంధించిన పత్రాల వ్యవహారంలో ఇప్పుడు హాజరయ్యారు. ఇంత జరుగుతున్నా ట్రంప్ కోర్ట్ వద్ద చాలా ప్రశాంతంగా నవ్వుతూ కనిపించారు. కోర్టుకు వెళ్లే ముందు పాస్టర్లతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తన మద్దతు దారులతో నవ్వుతూ జోకులు వేస్తూ కరచాలనం చేశారు. అడిగిన వారందరికీ ఫోటోలకు పోజ్ లు ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story