నేనే గెలిచాను: ట్రంప్

ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు.. బైడెన్ గెలుపుని అంగీకరించలేకపోతున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఓడిపోయారని ఎలక్షన్ రిజల్డ్ చెబుతున్నా.. నేను గెలిచాను అంటూ ట్వీట్ చేయడం ఆయనకు పదవీ వ్యామోహం తీరలేదన్న విషయం తేటతెల్లమవుతోందని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు ట్రంప్ ట్వీట్‌ను ట్విట్టర్ ఫ్లాగ్ చేసింది.
కాగా ఎన్నికల్లో ఓటమిని అంగీకరించాలని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ట్రంప్‌నకు సూచించారు. ఫలితాన్ని మార్చే అవకాశం లేదని, ఇకనైనా తన అహాన్ని పక్కన పెట్టి దేశ హితం కోసం పాటుపడాలని హితవు పలికారు. తాజా ఎన్నికల ప్రకారం అమెరికా పూర్తిగా రెండు భాగాలుగా విడిపోయినట్లు స్పష్టమవుతోందిని, ట్రంప్ నిరంతరం అసత్యాలు ప్రచారం చేస్తే ప్రత్యర్థి దేశాలు అమెరికా బలహీన పడిందని భావిస్తాయన్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com