రహస్య పత్రాల కేసులో ట్రంప్

అంతర్జాతీయం
రహస్య పత్రాల కేసులో ట్రంప్
ఫెడరల్‌ ప్రభుత్వ అభియోగాలు నమోదైన తొలి మాజీ అధ్యక్షుడు ట్రంప్‌. నేరాభియోగాల విషయాన్ని ట్రంప్‌ స్వయంగా తెలిపారు

రహస్య పత్రాల కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ పై నేరాభియోగాలు నమోదైంది. రహస్య పత్రాల కేసులో ఆయనపై నేరాభియోగాలు నమోదయ్యాయి. పెంటగాన్‌ దాడుల ప్రణాళికలు, సైనిక చర్యకు సంబంధించిన సీక్రెట్‌ మ్యాప్‌, విదేశాల అణు సామర్థ్యాల సమాచారాన్ని ఆయన తన నివాసానికి తీసుకువెళ్లిపోయారని అభియోగాలు నమోదు చేవారు. ఫెడరల్‌ ప్రభుత్వ అభియోగాలు నమోదైన తొలి మాజీ అధ్యక్షుడు ట్రంప్‌. నేరాభియోగాల విషయాన్ని ట్రంప్‌ స్వయంగా తెలిపారు. ఈ కేసులో జూన్‌ 13 మయామిలోని ఫెడరల్‌ కోర్టు హౌజ్‌లో హాజరు కావాలని తనకు సమన్లు అందినట్లు తెలిపారు. ఇందులో ట్రంప్‌ దోషిగా తేలితే జైలుశిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. గతంలో అశ్లీల చిత్రాల నటి స్టార్మీ డేనియల్స్‌కు డబ్బు చెల్లింపుల కేసులో ట్రంప్‌పై నేరాభియోగాలు నమోదయ్యాయి.

మరోవైపు ట్రంప్‌ 2021 జనవరిలో అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తర్వాత ప్రభుత్వానికి చెందిన దాదాపు 300 రహస్య పత్రాలను ఫ్లోరిడాలోని తన మార్‌-ఎ-లాగో ఎస్టేట్‌కు తరలించినట్లు ఆరోపణలొచ్చాయి. వైట్‌ హౌస్‌ ఖాళీ చేసేటప్పుడు సమయం లేక పోవడంతో హడావుడిలో ఆ పత్రాలను తమ వెంట తీసుకెళ్లి ఉండొచ్చని గతంలో ట్రంప్‌ కార్యాలయం తెలిపింది. అయితే, వాటిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు నేషనల్‌ ఆర్కైవ్స్‌ అండ్‌ రికార్డ్‌ అడ్మినిస్ట్రేషన్‌ అధికారులు ప్రయత్నించగా.. ట్రంప్‌ అడ్డుకున్నారు. అయితే ఎఫ్‌బీఐ సోదాల్లో ట్రంప్‌ ఎస్టేట్‌లో 15 పెట్టెల్లో 184 కీలక పత్రాలు దొరికాయి.ఎఫ్‌బీఐ మరోసారి ఆ ఎస్టేట్‌పై దాడి చేసి 20 పెట్టెల నిండా పత్రాలను తరలించింది.

అయితే అభియోగాల నేపథ్యంలో ట్రంప్‌ ఓ వీడియో మేసేజ్‌ చేశారు. తాను అమాయకుడినని తెలిపారు. ఎన్నికల్లో తనను అడ్డుకునేందుకు డెమోక్రాట్లు కుట్రపూరితంగా అభియోగాలు నమోదయ్యేలా చేశారని ఆరోపించారు. వచ్చేఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరఫున పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story