Donald Trump: డోనాల్డ్ ట్రంప్ జోరు.. .. మిసోరి, మిషిగన్‌, ఐడహోల్లోనూ ఘనవిజయం

Donald Trump:  డోనాల్డ్ ట్రంప్ జోరు.. .. మిసోరి, మిషిగన్‌, ఐడహోల్లోనూ ఘనవిజయం
మూడు రాష్ట్రాల్లో కూడా నిక్కీ హేలీ ఓటమి

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల్లో మూడోసారి తలపడటం ఖాయంగా కనిపిస్తోంది. అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం జరిగిన రాష్ట్రాల ఎన్నికల్లో ట్రంప్ ముందంజలో ఉన్నారు. తాజాగా జరిగిన మిస్సోరి, మిచిగన్ , ఐదహొ ప్రైమరీ ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్లు భావిస్తున్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ , రిపబ్లికన్ పార్టీల తరఫున పోటీపడే అభ్యర్థి ఎన్నికకు మంగళవారం ఓటింగ్ నిర్వహిస్తారు. రిపబ్లికన్ పార్టీకి 2,429 మంది ప్రతినిధులు ఉండగా అధ్యక్ష అభ్యర్థిత్వం పొందటానికి 1,215 మంది మద్దతు అవసరం. ఇప్పటివరకు జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ నకు 244మంది మద్దతు లభించింది. మంగళవారం జరిగే ఓటింగ్ లో ట్రంప్ నకు 874 ఓట్లు వస్తే ఆయన అభ్యర్థిత్వం ఖరారవుతుంది. డెమోక్రటిక్ పార్టీకి 3,979 మంది ప్రతినిధులు ఉన్నారు. డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీపడే వారికి 1968 మంది ప్రతినిధుల మద్దతు కావాలి. డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వం రేసులో బైడెన్ ముందున్నారు. ఇప్పటివరకు జరిగిన ప్రైమరీల్లో ఆయన 206 మంది ప్రతినిధుల మద్దతు పొందారు. మంగళవారం ఆయనకు 1762మంది పార్టీ ప్రతినిధుల మద్దతు లభిస్తే సరిపోతుంది.

రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం వంటి అనేక కారణాల వల్ల ప్రస్తుత USA అధ్యక్షుడు జో బైడెన్ ప్రజాదరణ క్రమంగా క్షీణిస్తోంది. ది న్యూయార్క్ టైమ్స్, సియానా కాలేజ్ నిర్వహించిన సర్వే ప్రకారం జో బైడెన్ పని పనితీరుకు 47% మాత్రమే ఆమోదం లభించింది. దేశం సరైన దిశలో పయనిస్తోందని నలుగురిలో ఒకరు (24%) మాత్రమే భావిస్తున్నారని సర్వే పేర్కొంది. మిగిలిన ముగ్గురు వ్యక్తులు జో బైడెన్ విధానాలు దేశానికి హాని కలిగించాయని భావిస్తున్నారు. ఈ క్రమంలలో వచ్చే ఎన్నికల్లో బైడెన్ గెలుపు కష్టమేనని చెప్పవచ్చు. మరి మళ్లీ ట్రంప్‌కు పట్టం కడతారా లేదా అనేది వేచి చూడాలి.


Tags

Read MoreRead Less
Next Story