Donald Trump : నేను గెలవకపోతే అమెరికాలో ‘రక్తపాతమే’: ట్రంప్‌

Donald Trump : నేను గెలవకపోతే అమెరికాలో ‘రక్తపాతమే’: ట్రంప్‌
ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

మెరికా అధ్యక్షుడిగా తనను ఎన్నుకోకపోతే దేశంలో రక్తపాతం తప్పదని రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. అధ్యక్ష ఎన్నిక జరుగనున్న నవంబర్‌ 5.. అమెరికా చరిత్రలో అత్యంత ముఖ్యమైన తేదీ అని చెప్పారు. ఒహియోలోని వాండాలియాలో జరిగిన ర్యాలీలో ట్రంప్‌ మాట్లాడారు. అయితే ఈ వ్యాఖలు ఏ ఉద్దేశంలో చేశారో స్పష్టంగా వెల్లడించలేదు. అధ్యక్షుడిగా తాను ఎన్నికైతే అమెరికాకు దిగుమతి చేసుకున్న కార్లను చైనా విక్రయించలేదని పేర్కొన్నారు. మెక్సికోలో కార్లను తయారు చేసి వాటిని అమెరికన్లను అమ్మాలని డ్రాగన్‌ దేశం చూస్తున్నదని విమర్శించారు. తన ప్రత్యర్థి అయిన జో బైడెన్‌ను ‘చెత్త’ అధ్యక్షుడిగా అభివర్ణించారు. వలసదారులకు మిలియన్ల కొద్ది వర్క్‌ పర్మిట్లు మంజూరు చేయడం ద్వారా ఆఫ్రికన్‌-అమెరికన్‌ ఓటర్లకు బైడెన్‌ వెన్నుపోటుపొడిచారని ఆరోపించారు.

అమెరికాలో ఈసారి జరుగబోయే ఎన్నికల్లో 2020 పునరావృతం కానుంది. మరోసారి జో బిడెన్, డొనాల్డ్ ట్రంప్ యునైటెడ్ స్టేట్స్ అధ్యక్ష పదవికి పోరులో తలపడ్డారు. డెమొక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య పోరు మరింత వేడెక్కుతోంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకదాని తర్వాత మరొకటి గెలుస్తూ అధ్యక్ష ఎన్నికల్లో తన స్థానాన్ని ఖాయం చేసుకున్నారు. ఇప్పుడు భయంకరమైన బెదిరింపులు ఇచ్చాడు. ఈ ఎన్నికల్లో రక్తపాతం తప్పదని బెదిరించారు.

మెక్సికోలో కార్లను తయారు చేసి అమెరికన్లకు విక్రయించాలనే చైనా ప్రణాళికలను ఆయన విమర్శించారు, “నేను ఎన్నికైతే, వారికి ఆ కార్లను విక్రయించే అవకాశం లేదు. అదే సమయంలో, జో బిడెన్ అమెరికా చెత్త అధ్యక్షుడిగా పేర్కొన్న ట్రంప్.. “నేను ఈసారి ఎన్నిక కాకపోతే, రక్తపాతం జరుగుతుంది” అని అంటూ హెచ్చరికలు జారీ చేశాడు. ఇక బిడెన్ ఇమ్మిగ్రేషన్ విధానాన్ని కూడా ట్రంప్ విమర్శించారు. “మిలియన్ల కొద్దీ వలసదారులకు పని అనుమతి ఇవ్వడం ద్వారా బిడెన్ ఆఫ్రికన్-అమెరికన్ ఓటర్లను పదేపదే వెన్నుపోటు పొడిచాడు” అని ట్రంప్ విమర్శించారు.

రిపబ్లికెన్​ పార్టీ కీలక నేత, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ చేసిన సంచలన వ్యాఖ్యలపై డెమొక్రాట్​ పార్టీ, జో బైడెన్​ వర్గం ప్రకటన విడుదల చేసింది. "2020 జనవరి 6న జరిగిన హింస అందరికి గుర్తుంది. దానిని మళ్లీ రిపీట్​ చేయాలని ట్రంప్​ చూస్తున్నారు. ఆయనొక లూజర్​. ప్రజలు తెలివైన వారు. ఈసారి కూడా ఆయన్ని ఓడిస్తారు. హింసతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని ఓడిస్తారు," అని జో బైడెన్​ క్యాంపైన్​ చెప్పుకొచ్చింది.

ఇదే విషయంపై.. వాషింగ్టన్​లో జరిగిన ఓ ఈవెంట్​లో మాట్లాడారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​."స్వేచ్ఛపై దాడి జరుగుతోంది. 2020 ఎన్నికల్లో చెప్పిన అబద్ధాలు, తీర్పును తారుమారు చేయాలని చేసిన ప్రయత్నాలు, జనవరి 6 సంఘటన.. ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారాయి. 2020లో వాళ్లు ఓడిపాయారు. కానీ ప్రమాదం ఇంకా పొంచి ఉంది," అని జో బైడెన్​ అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story