Donald Trump: డొనాల్డ్ ట్రంప్ ఖాతాలో భారీ విజయం

Donald Trump:  డొనాల్డ్ ట్రంప్ ఖాతాలో భారీ విజయం
న్యూ హాంప్‌షైర్ ప్రైమరీలో గెలిచిన డొనాల్డ్ ట్రంప్

రిప‌బ్లిక‌న్ పార్టీ త‌ర‌పున అధ్య‌క్ష అభ్య‌ర్థిగా పోటీ ప‌డేందుకు అమెరికా మాజీ దేశాధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్ర‌య‌త్నిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే పార్టీ అభ్య‌ర్థిత్వం కోసం జ‌రుగుతున్న ప్రైమ‌రీ ఎన్నిక‌ల్లో ఇప్ప‌టికే ఓ విక్ట‌రీ కొట్టిన ట్రంప్ ఇవాళ మ‌రో భారీ విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు. అధ్యక్ష ఎన్నికల రేసులో అత్యంత కీలకమైన రిపబ్లికన్ ప్రైమరీ ఎలక్షన్‌లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత కీలక విజయం సాధించారు. న్యూ హాంప్‌షైర్ ప్రైమరీని ఆయన గెలిచారు. దీంతో రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ నామినేషన్‌ను ఖరారు చేసుకోవడానికి ఆయన చేరువయ్యారు. ఇక ఈ గెలుపుతో అధ్యక్షుడు జో బైడెన్‌తో సమానంగా ట్రంప్ నిలిచారు. అయితే రిపబ్లికన్ పార్టీలో ట్రంప్‌నకు ఏకైక పోటీదారుగా భావిస్తున్న నిక్కీ హేలీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు తెలుస్తోంది. నిక్కీ హేలీ రేసు నుంచి తప్పుకునే స్థాయిలో ట్రంప్ విజయం సాధించారా లేదా అనేది తెలియాల్సి ఉంది. కౌంటింగ్ ఇంకా కొనసాగుతుండడంతో ఈ విషయంలో అస్పష్టత నెలకొంది.

కాగా అధ్యక్షుడు జో బైడెన్‌ను ట్రంప్ మాత్రమే ఓడించగలరని రిపబ్లికన్లు భావిస్తున్నారు. అందుకే ఆయనకు మద్ధతు ఇస్తున్నారు. నిక్కీ హేలీ కూడా గతంలో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అధ్యక్ష ఎన్నికల రేసులో తాను చాలా దూరంలో ఉన్నానని అన్నారు. అయితే న్యూ హాంప్‌షైర్ ప్రైమరీలో ఓటు అనుకూలంగా పడుతుందని ఆమె భావించారు. కానీ ప్రాథమిక సమాచారం ప్రకారం నిక్కీ హేలీ ఓటమి అంచున నిలిచారు. అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ట్రంప్‌పై రెండుసార్లు అభిశంసన తీర్మానాలు, ఆయనపై నాలుగు క్రిమినల్ కేసులు విచారణలో ఉన్నప్పటికీ రిపబ్లికన్లు ఆయనవైపే మొగ్గు చూపుతున్నారు. న్యూ హ్యాంప్‌షైర్‌లో ట్రంప్‌కు 55 శాతం ఓట్లు ప‌డ్డాయి. ఇక రెండవ స్థానంలో నిక్కి హేలీ ఉంది. వారం క్రితం ఐయోవాలో జ‌రిగిన ప్రైమ‌రీలో కూడా ట్రంప్ నెగ్గిన విష‌యం తెలిసిందే. న్యూ హ్యాంప్‌షైర్‌లో 22 మంది డిలీగేట్స్ ఉండ‌గా, దాంట్లో ట్రంప్ 11, హేలీ 8 గెలుచుకున్న‌ట్లు స‌మాచారం.

ఈ ఏడాది అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. నాలుగేళ్లకోసారి జరిగే ఈ ఎన్నికల పోలింగ్‌ను డిసెంబర్‌లో నిర్వహించే అవకాశం ఉంది. ప్రస్తుతం డెమోక్రటిక్ పార్టీ అధికారంలో ఉందక్కడ. జో బైడెన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన పదవీ కాలం ముగియడానికి ఇంకో ఏడాది మాత్రమే మిగిలివుంది.

ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ.. ఎన్నికల కోసం సన్నాహాలు చేపట్టింది. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను తమ పార్టీ అభ్యర్థిగా ఎన్నుకుంది. ఆయనపై పలు నేరారోపణలు, కేసులు ఉన్నప్పటికీ.. ట్రంప్‌పైనే విశ్వాసం ఉంచింది. 2019 నాటి ఎన్నికల్లో ఓడినా మళ్లీ ట్రంప్ అభ్యర్థిత్వానికే మొగ్గు చూపింది.

Tags

Read MoreRead Less
Next Story