Russia: ఎయిర్ పోర్టుపై విరుచుకుపడిన డ్రోన్లు

Russia: ఎయిర్ పోర్టుపై విరుచుకుపడిన డ్రోన్లు
నాలుగు భారీ రవాణా విమానాలు ధ్వంసం

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధంప్రారంభించి ఏడాదిన్నర దాటింది. ఉక్రెయిన్ ను తీవ్రంగా నష్ట పరచాలన్న రష్యా ఉద్దేశం కాస్త నెరవేరినప్పటికీ, రష్యా కూడా చాలా రకాలుగా నష్టపోయింది. ఒక్కోసారి రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ పుంజుకున్నట్లే కనిపిస్తోంది. రష్యాలో మరోసారి డ్రోన్ల దాడి కలకలం సృష్టించింది. పోస్కోవ్​ ఎయిర్​పోర్ట్​పై జరిగిన ఈ డ్రోన్ల దాడి వల్ల నాలుగు రవాణా విమానాలు దెబ్బతిన్నాయి. ఈ విషయాన్ని స్థానిక అధికార వర్గాలు వెల్లడించాయి. ఎక్కడి నుంచి వస్తాయో తెలియని డ్రోన్లు రష్యాలోని ఎయిర్ పోర్టులపై, కీలక స్థావరాలపై దాడి చేసిన ఘటనలు ఇప్పటికే పలుమార్లు జరిగాయి.

తాజాగా రష్యాలోని పొస్కోవ్ ఎయిర్ పోర్టుపైనా డ్రోన్లు విరుచుకుపడ్డాయి. నాలుగు కార్గో విమానాలను ఈ డ్రోన్లు దెబ్బతీయగలిగాయి. ప్రపంచంలోనే అత్యంత భారీ రవాణా విమానాలుగా పేరుగాంచిన ఇల్యూషిన్-76 విమానాలకు నష్టం వాటిల్లినట్టు అధికారులు గుర్తించారు. రౌండ్ దాడి సమయంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగినట్టు పేర్కొన్నారు. దాడి జరిగిన నగరం ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రయాణం నష్టం జరగలేదని అధికారులు తెలిపాయి. డ్రోన్ల దాడికి సంబంధించిన వీడియోను స్థానిక గవర్నర్ టెలిగ్రామ్ లో షేర్ చేశారు. ఈ దాడిలో పాల్గొన్న డ్రోన్లపై రష్యా సైన్యం ప్రతిదాడులకు దిగింది.

రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలై సుమారు రెండేళ్లు కావస్తోంది. కానీ ఇరు వర్గాలు శాంతించే దాఖలాలు మాత్రం కనుచూపుమేరలో కనిపించడం లేదు. యుద్ధం కారణంగా ఇప్పటికే లక్షల సంఖ్యలో సామాన్యులు, సైనికులు మృతిచెందారు. యుద్ధం ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో కూడా తెలియదు.


ఈ యుద్ధం ముఖ్యంగా ఉక్రెయిన్ ప్రజలను అస్థవ్యస్థం చేస్తోంది. చాలా మంది ప్రాణభయంతో విదేశాలకు వెళ్లారు. అక్కడున్న వారు బిక్కుబిక్కుమంటూ జీవనం వెళ్లదీస్తున్నారు. 60 లక్షలకు పైగా ఉక్రెయిన్ ప్రజలు శరణార్ధులుగా మారినట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. ఇప్పటి వరకు ఈ యుద్ధంలో 9 వేలకు పైగా సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయపడ్డారు.

ప్రపంచ దేశాలు రష్యాపై ఆంక్షాలు విధించినా వెనక్కు తగ్గడం లేదు. ఉక్రెయిన్ స్వాధీనం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఈ యుద్ధంలో ఉక్రెయిన్ సైనికులే కాదు.. రష్యా సైనికులు కూడా భారీ సంఖ్య ప్రాణాలు కోల్పోయారు. ఉక్రెనియన్ దళాలు తగినంత ఆయుధాలు, మందుగుండు సామాగ్రి లేకుండా నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. అయితే ప్రపంచ దేశాల నుంచ ఆ దేశానికి ఆయుధాలు వస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story