బాడీగార్డ్‌తో దుబాయ్ ప్రిన్సెస్ ప్రేమాయణం.. రూ.9 కోట్లు చెల్లించి..

బాడీగార్డ్‌తో దుబాయ్ ప్రిన్సెస్ ప్రేమాయణం.. రూ.9 కోట్లు చెల్లించి..
దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆరవ భార్య హయా గత రెండేళ్లుగా బాడీగార్డ్ రస్సెల్ ప్లవర్స్‌తో ..

జోర్డాన్ యువరాణి హయా దుబాయ్ పాలకుడి ఆరవ భార్య. ఆమె తన బ్రిటీష్ బాడీగార్డ్‌తో అక్రమ సంబంధం పెట్టుకుంది. బాడీగార్డ్‌తో తన సంబంధాన్ని దాచడానికి అతడికి పెద్ద మొత్తంలో నగదు బహుమతులు ముట్టజెప్పేదని ఒక నివేదిక పేర్కొంది. దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆరవ భార్య హయా గత రెండేళ్లుగా బాడీగార్డ్ రస్సెల్ ప్లవర్స్‌తో ప్రేమాయణం కొనసాగిస్తోంది.

ఈ వ్యవహారాన్ని రహస్యంగా ఉంచడం కోసం అతడికి 1.2 మిలియన్ డాలర్ల నగదు (రూ.8,88,59,400) తో పాటు 12 వేల డాలర్ల విలువైన వాచ్, అరుదైన షాట్‌గన్ ఇచ్చినట్లు నివేదికలో వెల్లడించారు. వీరి వ్యవహారం ఇలా ఉండగా రస్సెల్ భార్య మాట్లాడుతూ.. హయా నా భర్తకు భారీ ఎత్తున నగదు, ఖరీదైన బహుమతులు ఇచ్చి లొంగదీసుకుంది.. రస్సెల్‌ని తన దగ్గరే ఉంచుకుంది అని తెలిపింది. ఆమె తన భర్తకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నట్లు పేర్కొంది.

ప్రిన్సెస్‌కు, ఆమె 70 ఏళ్ల మాజీ భర్తకు మధ్య హైకోర్టులో విచారణ జరుగుతున్న సందర్భంగా బాడీగార్డుతో హయాకు ఉన్న రహస్య సంబంధం బయటపడింది. లండన్ హైకోర్టులో చైల్డ్ కస్టడీ పాక్ట్-ఫైండింగ్‌లో భాగంగా ఈ వివరాలు వెలువడ్డాయి. ప్రిన్సెస్ హయా తన బాడీగార్డుతో అక్రమ సంబంధం కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం హయా తన ఇద్దరు పిల్లలతో వెస్ట్ లండన్‌లోని కెన్సింగ్టన్‌లో నివాసం ఉంటున్నారు. అయితే, దుబాయ్ పాలకుడు యువరాణికి చెప్పకుండా షరియా చట్టం ప్రకారం 2019 ఫిబ్రవరిలో విడాకులు తీసుకున్నాడు.

యువరాణి హయా 2018 సంవత్సరంలో దుబాయ్ వదిలి చాలా సంవత్సరాలుగా యుకెలో నివసిస్తున్నారు. పిల్లలను తన దగ్గరే ఉంచుకుంటోందని యువరాణి హయాపై యూకే కోర్టులో కేసు పెట్టారు. అయితే ఆ తీర్పు హయాకు అనుకూలంగా వచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story