Indonesia : బాలి సముద్రంలో భారీ భూకంపం

Indonesia : బాలి సముద్రంలో భారీ భూకంపం
సునామీ హెచ్చరిక లేదు...

ఇండోనేషియాలోని బాలి, లాంబాక్ దీవులకు ఉత్తరాన సముద్రంలో మంగళవారం తెల్లవారుజామున 7.0 తీవ్రతతో బలమైన భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం ఇండోనేషియాలోని మాతరానికి ఉత్తరంగా 201 కిలోమీటర్ల దూరంలో భూమి ఉపరితలం నుంచి 518 కిలోమీటర్లు దిగువన ఉందని యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) తెలిపింది.

సముద్రగర్భంలో లోతుగా సంభవించిన భూకంపం ఫలితంగా సునామీ వచ్చే ప్రమాదం లేదని యూఎస్ సునామీ హెచ్చరిక వ్యవస్థ తెలిపింది.ఇండోనేషియా, యుఎస్ జియోలాజికల్ ఏజెన్సీలు భూకంప తీవ్రతన్ 7.1గా పేర్కొన్నాయి. ఇండోనేషియా జియోలాజికల్ ఏజెన్సీ ప్రకారం, బాలి, లాంబాక్‌లోని తీర ప్రాంతాలలో తెల్లవారుజామున 4 గంటలకు (2000 GMT) భూకంపం సంభవించింది.దాని తర్వాత 6.1 మరియు 6.5 తీవ్రతతో రెండు భూకంపాలు సంభవించాయి. బాలి మెర్క్యూర్ కుటా బాలిలోని పర్యాటకులు కొన్ని సెకన్ల పాటు ప్రకంపనలు అనుభవించిన తర్వాత వారి గదుల నుంచి బయటకు పరుగులు తీసినట్టుగా సమాచారం. భూకంపం చాలా లోతుగా ఉన్నందువల్ల ఆస్తి నష్టం జరగలేదని నిపుణులు చెబుతున్నారు.

అయితే ఇండోనేషియాలో తరుచూ భూకంపాలు వస్తుంటాయి. రెండు వారాల క్రితం కూడా అక్కడ భూకంపం సంభవించింది. ఇండోనేషియాలోని మలుకు ప్రావిన్స్‌లోని టువల్‌ అనే నగరానికి 142 కి.మీ దూరంలో భూకంపం సంభవించింది. 270 మిలియన్ల కంటే ఎక్కువ జనాభా కలిగిన ఇండోనేషియాలో అగ్నిపర్వతాలు, సునామీలు, భూకంపాలు వంటి విపత్తులు తరచూ వస్తుంటాయి.


Tags

Read MoreRead Less
Next Story