హైతీలో తీవ్ర భూకంపం..1297కు పెరిగిన మరణాలు

హైతీలో తీవ్ర భూకంపం..1297కు పెరిగిన మరణాలు
Haiti earthquake: భారీ భూకంపానికి కరేబియన్‌ దేశమైన హైతీ వణికిపోయింది

భారీ భూకంపానికి కరేబియన్‌ దేశమైన హైతీ వణికిపోయింది. హైతీలో రిక్టర్‌ స్కేల్‌పై 7.2 తీవ్రతతో భూకంపం రాగా.. ఇప్పటి వరకూ మరణాల సంఖ్య 1297కు పెరిగింది. మరో 2వేల 800 మంది గాయపడ్డారు. ఈ మేరకు ఆ దేశ రక్షణ శాఖ పేర్కొంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అటు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

కరేబియన్‌ దేశం హైతీలో.. శనివారం సంభవించిన భారీ భూకంపం ఆ దేశాన్ని అతలాకుతలం చేసింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.2 గా నమోదైంది. వందల సంఖ్యలో మృతి చెందారు. శిథిలాల కింద తవ్వే కొద్ది మృతదేహాలు బయటపడుతుండటంతో.. మృతలు సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అటు.. వేలాది మంది గాయపడ్డారు. అనేక మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. హైతీ సముద్ర తీర ప్రాంతంలో అలలు పది మీటర్ల ఎత్తున ఎగిసిపడ్డాయి. సునామీ హెచ్చరికలు సైతం జారీ చేశారు.

ఆ తర్వాత.. సునామీ హెచ్చరికల్ని వెనక్కి తీసుతున్నారు. అత్యంత జనసాంద్రత కలిగిన రాజధాని పోర్ట్-ఓ-ప్రిన్స్ నగరానికి 160 కిలోమీటర్ల దూరంలో సెయింట్ లూయిస్ డు సుడ్‌కు ఈశాన్యంగా 12 కిలోమీటర్లు దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకటించింది..

భూప్రకంపనల ధాటికి పలు చోట్ల భవనాలు, వేల ఇళ్లు కుప్పకూలాయి. ప్రజలు భయాందోళలతో రోడ్లపైకి పరుగులు తీశారు. గాయపడినవారిని విపత్తు, సహాయ బృందాలు సమీప ఆసుపత్రులకు తరలించాయి. భూకంపం కారణంగా దాదాపు 8వందల మందికి పైగా మరణించినట్లు సమాచారం అందుతోంది. మరోవైపు 2వేల 800 మంది గాయపడగా.. పలువురు గల్లంతైనట్లు ఆ దేశ పౌర రక్షణ శాఖ తెలిపింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని పేర్కొంది. శిథిలాల కింద చిక్కుకున్న వారు ప్రాణాలతో ఉండే అవకాశం ఉన్నందున.. రెస్క్యూ సిబ్బంది వారి కోసం వెతుకుతున్నారు.

ఇక హైతీలో మళ్లీ భూకంపం సంభవించే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు వీధుల్లోకి పరుగెత్తారు. కూలిన ఇళ్లు, హోటళ్లు, ఇతర నిర్మాణాల శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story