అమెరికాలో కాల్పులు.. ఇతర దేశాల నుంచి వచ్చిన వారే టార్గెట్‌గా కాల్పులు

అమెరికాలో కాల్పులు.. ఇతర దేశాల నుంచి వచ్చిన వారే టార్గెట్‌గా కాల్పులు
మసాజ్‌ సెంటర్లు, స్పా సెంటర్లను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడినట్టు తెలుస్తోంది.

అమెరికా గన్‌కల్చర్‌ కారణంగా అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా జీవనోపాధి కోసం ఇతర దేశాల నుంచి అమెరికాకు వచ్చిన వారినే టార్గెట్ చేసుకుంటున్నారు. కొన్ని రోజులుగా వరుస కాల్పుల ఘటనలు చోటుచేసుకోవడంతో వలస వచ్చిన వారితో పాటు అమెరికన్లు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా అట్లాంటా, అక్వర్త్ ప్రాంతాల్లోని మూడు మసాజ్ సెంటర్లలో దుండగులు కాల్పులు జరిపారు. ముందు అక్వర్త్‌లోని మసాజ్​ సెంటర్​వద్ద దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా, చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతిచెందారు.

కాల్పులు జరిగిన గంటలోనే అట్లాంటాలోని మరో రెండు మసాజ్​ సెంటర్ల వద్ద కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మహిళలు మరణించారు. మొత్తంగా ఈ కాల్పుల్లో 8 మంది చనిపోయారు. మృతుల్లో ఎక్కువ మంది ఆసియా మహిళలే ఉన్నారని చెరోకి కౌంటీ పోలీసులు తెలిపారు. మసాజ్‌ సెంటర్లు, స్పా సెంటర్లను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడినట్టు తెలుస్తోంది. కాల్పులు జరిపిన రాబర్డ్‌ లాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత ఆదివారం కూడా చికాగోలో ఓ పార్టీ జరుగుతుండగా దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది.


Tags

Read MoreRead Less
Next Story