MUSK: చాట్‌జీపీటీకి పోటీగా మస్క్‌ కొత్త కంపెనీ

MUSK: చాట్‌జీపీటీకి పోటీగా మస్క్‌ కొత్త కంపెనీ
మరో సంచలన నిర్ణయం తీసుకున్న ఎలాన్‌ మస్క్‌..కృత్రిమ మేధ రంగంలో కొత్త కంపెనీ స్టార్ట్‌... ఎక్స్‌ఏఐ పేరుతో కంపెనీ లాంచ్‌

టెస్లా, ట్విట్టర్‌ అధినేత, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలాన్‌ మస్క్‌..మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ భవిష్యత్‌ను నిర్ణయిస్తున్న కృత్రిమ మేధ (Artificial Intelligence) రంగంలో కొత్త కంపెనీ స్టార్ట్‌ చేయబోతున్నట్లు మస్క్‌ ప్రకటించారు. ఓపెన్‌ఏఐ (OpenAI) తీసుకొచ్చిన చాట్‌బాట్‌ చాట్‌జీపీటీ (ChatGPT).. గూగుల్‌ బార్డ్‌ (Bard)లకు పోటీగా ఎక్స్‌ఏఐ(xAI) పేరుతో కృత్రిమే మేధ కంపెనీను లాంచ్‌ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ ప్రకటనతో మస్క్‌ నేతృతంలో మరో కంపెనీ జత కానుంది. ఈ కృత్రిమ మేధ కంపెనీ ఎక్స్‌ఏఐ(xAI) లక్ష్యం...ఈ విశ్వం నిజమైన స్వభావాన్ని అన్వేషించడం, అర్ధం చేసుకోవడమే అని మస్క్‌ వెల్లడించారు.


తమ బృందానికి ఎలాన్‌ మస్క్‌ నేతృత్వం వహించనున్నారని, గూగుల్‌ డీప్‌మైండ్‌, ఓపెన్‌ఏఐ, గూగుల్‌ రీసెర్చ్‌, మైక్రోసాఫ్ట్‌ రీసెర్చ్‌, టెస్లా వాటిల్లో పనిచేసిన నిపుణులు ఈ కంపెనీలో భాగమయ్యారని ఎక్స్‌ఏఐ కంపెనీ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. డీప్‌మైండ్‌ ఆల్ఫాకోడ్, ఓపెన్‌AI, GPT-3.5, GPT-4 చాట్‌బాట్‌లు సహా ముఖ్యమైన ప్రాజెక్టుల్లో వీళ్లు పని చేశారు. xAIతో ద్వారా.. చాట్‌జీపీటీ, బార్డ్, క్లాడ్ చాట్‌బాట్‌లను డెవలప్‌ చేసిన ఓపెన్‌ఏఐ, గూగుల్, ఆంత్రోపిక్ వంటి ఎస్టాబ్లిష్‌డ్‌ ప్లేయర్స్‌తో పోటీ పడేందుకు మస్క్ బరిలోకి దిగాడు. డీప్‌మైండ్‌ ఆల్ఫాకోడ్, ఓపెన్‌AI, GPT-3.5, GPT-4 చాట్‌బాట్‌లు సహా ముఖ్యమైన ప్రాజెక్టుల్లో వీళ్లు పని చేశారు. xAIతో ద్వారా.. చాట్‌జీపీటీ, బార్డ్, క్లాడ్ చాట్‌బాట్‌లను డెవలప్‌ చేసిన ఓపెన్‌ఏఐ, గూగుల్, ఆంత్రోపిక్ వంటి ఎస్టాబ్లిష్‌డ్‌ ప్లేయర్స్‌తో పోటీ పడేందుకు మస్క్ బరిలోకి దిగాడు.


ఈ ఏడాది మార్చిలో, నెవాడాలో xAI మస్క్‌ ప్రారంభించాడు. కొన్ని ఫైనాన్షియల్‌ ఫైలింగ్స్‌లో Twitter పేరును "X Corp"గా చెప్పాడు. xAI వెబ్‌సైట్ ప్రకారం, X Corpలో xAI భాగం కాదు. అయితే, X (Twitter), టెస్లా, ఇతర మస్క్‌ కంపెనీలతో కలిసి ఇది పని చేస్తుంది. మస్క్ టెస్లా ఇంక్.. స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ టెక్నాలజీస్ కార్పోరేషన్ పెట్టుబడిదారులతో AI స్టార్టప్‌కు నిధులు సమకూర్చడం గురించి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

కృత్రిమమేధలో పెను విప్లవంగా మారిన ‘చాట్‌జీపీటీ’ అభివృద్ధి దశలో ఉన్న సమయంలో ఓపెన్‌ఏఐ (OpenAI) సంస్థలో ఎలాన్‌ మస్క్‌ భారీ పెట్టబడులు పెట్టారు. తర్వాత ఆయన వాటిని ఉపసంహరించుకున్నారు. అనంతరం మైక్రోసాఫ్ట్ సంస్థ ఓపెన్‌ఏఐలో పెట్టుబడులు పెట్టింది. ఈ క్రమంలోనే ఓపెన్‌ఏఐ చాట్‌జీపీటీని అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో ఏఐకి సంబంధించి మానవాళికి ముప్పు పొంచి ఉందని పలుమార్లు మస్క్‌ హెచ్చరించారు. చాట్‌జీపీటీ (ChatGPT) తరహా చాట్‌బాట్‌లు పక్షపాతంగా వ్యహరించే ప్రమాదం ఉందని తెలిపారు. ఇలాంటి వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు తాను కూడా కృత్రిమ మేధ ఆధారిత చాట్‌బాట్‌ను తీసుకురానున్నట్లు వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story