Encounter : పాకిస్థాన్‌లో ఎన్‌కౌంటర్‌…

Encounter : పాకిస్థాన్‌లో ఎన్‌కౌంటర్‌…
8 మంది ఉగ్రవాదుల హతం

పాకిస్థాన్ దేశంలో జరిగిన ఎన్‌కౌంటర్‌‌లో 8 మంది ఉగ్రవాదులు హతం అయ్యారు. ఖైబర్ పఖ్తుంఖ్వాలోని దక్షిణ వజీరిస్థాన్ జిల్లాలో సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య తీవ్ర స్థాయిలో ఎదురుకాల్పులు జరిగాయి. ఇంటెలిజెన్స్ ఆధారిత ఆపరేషన్‌లో భద్రతా దళాలు ఎనిమిది మంది ఉగ్రవాదులను హతమార్చాయని మిలిటరీ మీడియా విభాగం ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ తెలిపింది. సరోఘా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం ఆధారంగా నిఘా ఆధారిత ఆపరేషన్ నిర్వహించారు.

పాకిస్థాన్‌ జిల్లాలోని సరోఘా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం ఆధారంగా నిఘా ఆధారిత ఆపరేషన్ (ఐబీఓ) నిర్వహించారు. ఈ క్రమంలో సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య తీవ్ర స్థాయిలో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఆపరేషన్‌లో ఎనిమిది మంది ఉగ్రవాదులు హతమైనట్లు ISPR తెలిపింది. హతమైన ఉగ్రవాదులు భద్రతా బలగాలతో పాటు అమాయక పౌరులకు వ్యతిరేకంగా అనేక ఉగ్రవాద కార్యకలాపాలలో చురుకుగా పాల్గొన్నారు. వారి నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దేశం నుండి ఉగ్రవాద ముప్పును తుడిచిపెట్టాలని భద్రతా దళాలు నిశ్చయించుకున్నందున, ఇతర ఉగ్రవాదులను అంతమొందించడానికి ఈ ప్రాంతంలో శానిటైజేషన్ ఆపరేషన్ జరుగుతోందని పేర్కొంది.


ఈ క్రమంలో సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య తీవ్ర స్థాయిలో ఎదురుకాల్పులు జరిగాయి. సంఘటన స్థలంల ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పాక్ ఆర్మీ తెలిపింది. దేశం నుంచి ఉగ్రవాద ముప్పును తుడిచిపెట్టడంలో భాగంగా ఉగ్రవాదులను అంతమొందించడానికి ఆపరేషన్ జరుగుతోందని పాక్ ఆర్మీ పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story