WILDFIRE: ఐరోపాను కమ్మేసిన కార్చిచ్చు

WILDFIRE: ఐరోపాను కమ్మేసిన కార్చిచ్చు
ఇటలీ, క్రొయేషియా, గ్రీస్‌లలో దావానలం... అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న సిబ్బంది....

యూరప్‌ను కార్చిచ్చు(Europe wildfires) కమ్మేస్తోంది. ఎటుచూసినా అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలకు తోడు భీకరంగా వీస్తున్న గాలులు తోడయ్యాయి. క్రొయేషియా(Croatia)లోని డుబ్రోవ్నిక్, తుర్కియే(Türkiye)లోని కెమెర్‌ సహా ఇటలీలోని సిసిలీ నగరాన్ని కార్చిచ్చు కల్లోల పరుస్తోంది. అధిక ఉష్ణోగ్రతలకు తోడు బలమైన గాలులు మంటలకు మరింత ఆజ్యం పోస్తున్నాయి.కార్చిచ్చు కారణంగా వేలాది ఎకరాల అడవులను అగ్నిని దహించేస్తోంది. ఫైరింజిన్లు, విమానాలు, హెలికాఫ్టర్ల(Firefighters )తో రంగంలోకి దిగి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.


ఐరోపా ఖండం(EUROPE)లోని అనేక ప్రాంతాల్లో కార్చిచ్చు( wildfires) వేగంగా వ్యాపిస్తోంది. క్రొయేషియా(Croatia)లోని డుబ్రోవ్నిక్ ప్రాంతంలో కార్చిచ్చు అధిక ఉష్ణోగ్రతలు, బలమైన గాలుల(WINDS) ధాటికి మరింత వేగంగా వ్యాపిస్తోంది. మంటలను అదుపు చేసేందుకు 16 ఫైరింజన్లు, 95 మంది అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఘటనా స్థలానికి క్రొయేషియన్‌ వైమానిక దళం రెండు ప్రత్యేక విమానాలను సైతం తరలించింది. క్రొయేషియా పర్యాటక రంగానికి డుబ్రోవ్నిక్‌ ప్రధాన కేంద్రంగా ఉంది. ఈ ఏడాది ఇప్పటికే వేల సంఖ్యలో పర్యాటకులు డుబ్రోవ్నిక్‌ను సందర్శించినట్టు అధికారులు తెలిపారు.


తుర్కియే అంతాల్య ప్రావిన్స్‌లోని కెమెర్‌లో వ్యాపించిన కార్చిచ్చు సుమారు 296 ఎకరాల అడవికి విస్తరించింది. దీంతో ముందు జాగ్రత్తగా ఆ ప్రాంతంలోని వేలాది మందిని తుర్కియే అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మంటలను అదుపు చేసేందుకు 10 ప్రత్యేక విమానాలు, 22 హెలికాప్టర్లను రంగంలోకి దించినట్టు తుర్కియే పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి నూరి ఎర్సోయ్ వెల్లడించారు. ఒకట్రెండు రోజుల్లో మంటలను అదుపులోకి తెచ్చే విధంగా ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు.


దక్షిణ ఇటలీ సిసిలీలోని పలెర్మో, మెస్సినా ప్రాంతాలను కార్చిచ్చు కకావికలం చేస్తోంది. బలమైన గాలులు, అధిక ఉష్ణోగ్రతలతో కార్చిచ్చు మరింత వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో ఆ ప్రాంతాలలో నివసించే సుమారు 120 కుటుంబాలు రాత్రికి రాత్రే తరలివెళ్లాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. దావాగ్ని పలెర్మో విమానాశ్రయానికి చేరువవడంతో విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. సమీప ప్రాంత ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించామని, సహాయ చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story