Greece: గ్రీస్ లో పేలిన ఆయుధాగారం

Greece:  గ్రీస్ లో పేలిన ఆయుధాగారం
ఆయుధాలు తరలించడంతో తప్పిన ప్రమాదం

ద్వీప సమూహం గ్రీస్‌ను చుట్టేసిన కార్చిచ్చు పలు ప్రాంతాల్లో వేల ఎకరాల భూమి.. ఇళ్లు దహనం చేసుకొంటూ జనావాసాలపైకి వేగంగా వ్యాపిస్తోంది.దీనికి బలమైన గాలులు తోడవడంతో సెంట్రల్ గ్రీస్ లోని వైమానిక దళం మందుగుండు డిపో వరకు మంటలు వ్యాపించాయి. ఫలితంగా భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా F-16 ఫైటర్ జెట్ లను సమీపంలోని వైమానిక స్థావరానికి తరలించారు. మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా యత్నిస్తున్నారు. సైనిక స్థావరానికి తక్షణ ముప్పు లేదని గ్రీస్ వైమానిక దళం తెలిపింది.

గత కొంత కాలంగా గ్రీస్‌లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీ సెంట్రీగేడ్‌లు దాటడంతో కార్చిచ్చు అంటుకుంది. పలు ప్రాంతాల్లో వేల ఎకరాల భూమి.. ఇళ్లు, హోటళ్లను దహనం చేసుకొంటూ జనావాసాలపైకి వేగంగా వ్యాపిస్తోంది. ఇక గత రెండు వారాల్లో గ్రీస్ లోని కొన్ని ప్రాంతాలలో.. చెలరేగిన మంటలతో ఇద్దరు అగ్నిమాపక పైలట్ లతో సహా ఐదుగురు మరణించారు. రోడ్స్ , ఎవియా, కోర్ఫు దీవుల్లో ప్రజలు, పర్యాటకులు ప్రాణభయంతో ఇళ్లు, హోటళ్లు ఖాళీ చేశారు.


కార్చిచ్చుకు భయపడి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పిల్లలు, సామగ్రిని తీసుకొని ప్రజలు కాలినడకనే సురక్షిత ప్రదేశాలకు వెళ్లిపోతున్నారు. కొందరు ఎందుకైనా మంచిదని బీచ్‌ల్లోనే తాత్కాలిక ఆశ్రయం ఏర్పాటు చేసుకుంటున్నారు. మంటలను ఆర్పివేయడానికి, భారీ సంఖ్యలో అగ్నిమాపక సిబ్బందిని, విమానాలు, హెలికాప్టర్లను రంగంలోకి దింపారు. ఐరోపా సమాఖ్య, తుర్కియే, జోర్డాన్ , ఇజ్రాయెల్ , క్రొయేషియా దేశాలు గ్రీస్ కు సాయం అందిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story