Mexico : వణికిస్తున్న లిడియా హరికేన్

Mexico : వణికిస్తున్న లిడియా హరికేన్
అప్రమత్తమైన అధికారులు

అత్యంత ప్రమాదకరమైన లిడియా హరికేన్ మెక్సికో దేశాన్ని వణికిస్తోంది. ఈ లిడియా హరికేన్ మంగళవారం మెక్సికో దేశంలోని ఫసిఫిక్ తీరాన్ని తాకింది. మెక్సికో దేశంలోని ఫసిఫిక్ తీరంలో ఉన్న ప్యూర్టో వల్లర్టా వద్ద తుపాన్ తీరం దాటడంతో కేటగిరి 4 తుపానుగా మారిందని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్పారు. తరచూ తుపాన్లు సంభవిస్తుండటంతో ఆస్తి నష్టం జరుగుతోంది. మెక్సికోలో హరికేన్ సీజన్ అధికారికంగా జూన్ 1 నుండి నవంబర్ 30 వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో, ఎక్కడైనా హరికేన్‌లు అభివృద్ధి చెందడానికి వాతావరణ మరియు సముద్ర శాస్త్ర పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి.


లిడియా ప్యూర్టో వల్లార్టా బీచ్ రిసార్ట్ సమీపంలో తీరాన్ని తాకిన ఈ లిడియా తుపాన్ వల్ల గరిష్ఠంగా గంటకు 220 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని యూఎస్ నేషనల్ హరికేన్ సెంటర్ తెలిపింది. ఈ తుపాన్ విపత్తు వల్ల భారీ గాలులతోపాటు భారీవర్షాలు కురిశాయి. లిడియా తుపాన్ వల్ల మెక్సికో దేశం అతలాకుతలమైంది. స్కూల లకు స్థానిక కార్యాలకి సెలవులు ప్రకటించారు . ఈ ఆకస్మిక వరదలు, టోర్నడోలు, అధిక గాలులు, విద్యుత్తు అంతరాయాలు వాటిల్లుతున్నాయి. చాలా చోట్ల వరదలు పోటెత్తాయి. జనావాసాలు నీట మునిగాయి.


రహదారులు జలమయం అయ్యాయి. చాలా చెట్లు నేలకూలాయి. కొన్ని రోడ్లు కొట్టుకుపోయాయి. ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి. కొన్ని గంటల పాటు ఆగకుండా వీచాయి. తుఫాన్ ప్రభావానికి కొన్ని వంతెనలు కొట్టుకుపోయాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ నిలిచిపోయింది. కొన్ని చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాలు మునిగిపోవడంతో.. అక్కడి ప్రజలు నీటిలోంచే ప్రయాణాలు సాగిస్తున్నారు. చాలా ఇళ్లు పూర్తిగా జలమయమయ్యాయి. ఆగి ఉన్న వాహనాల కిటికీల వరకు నీరు చేరుకుంది.



Tags

Read MoreRead Less
Next Story