అంతర్జాతీయం

Beheshta Arghand : ఇంటర్వ్యూతో రిస్క్ చేసి.. దేశం విడిచి పారిపోయిన మహిళా జర్నలిస్టు..!

ఈ నెల ప్రారంభంలో ఆఫ్గనిస్తాన్‌‌ని తాలిబాన్లు ఆక్రమించాక వారిని ఇంటర్వ్యూ చేసిన టీవీ న్యూస్ మహిళా జర్నలిస్ట్ ఆఫ్ఘనిస్తాన్ నుండి పారిపోయింది.

Beheshta Arghand : ఇంటర్వ్యూతో రిస్క్ చేసి.. దేశం విడిచి పారిపోయిన మహిళా జర్నలిస్టు..!
X

ఈ నెల ప్రారంభంలో ఆఫ్గనిస్తాన్‌‌ని తాలిబాన్లు ఆక్రమించాక వారిని ఇంటర్వ్యూ చేసిన టీవీ న్యూస్ మహిళా జర్నలిస్ట్ ఆఫ్ఘనిస్తాన్ నుండి పారిపోయింది. టోలో న్యూస్‌‌లో కొత్తగా చేరిన 24 ఏళ్ల బెహెస్తా అర్ఘాంద్ ఈ నెల 17న తాలిబాన్ అధికార ప్రతినిధి మౌలావి అబ్దుల్‌హక్ హేమద్‌ని ఇంటర్వ్యూ చేశారు. ఇది ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. తాలిబన్లు కూడా తాము మారిపోయాం అని చెప్పుకోవడానికి ఆ ఇంటర్వ్యూను బాగానే వాడుకున్నారు. ఆ తర్వాత తాలిబాన్ల చేతిలో దాడికి గురైన మలాలాను ఇంటర్వ్యూ చేసి బెహెస్తా అర్ఘాంద్ చిక్కుల్లో పడింది. ఈ క్రమంలో ఆమె దేశం విడిచి పారిపోయింది.

''లక్షల మంది అఫ్గాన్‌ ప్రజల వలే నేను నా దేశాన్ని విడిచి వెళ్లపోతున్నాను. తాలిబన్లకు భయపడుతున్నాను'' అని ఆమె పేర్కొన్నారు. కాగా అర్ఘంద్ 9వ తరగతిలో ఉన్నప్పుడే జర్నలిస్ట్ కావాలని కోరుకుంది. టీచర్‌ ప్రోత్సాహంతో ఆమె జర్నలిజం వైపు అడుగులు వేసింది. నాలుగు సంవత్సరాలు పాటు కాబూల్ యూనివర్సిటీలో జర్నలిజం చేసింది. అనేక న్యూస్ ఏజెన్సీలు మరియు రేడియో స్టేషన్లలలో స్వల్ప వ్యవధిలో ఆమె పనిచేసింది. ఆ తర్వాత ఈ సంవత్సరం ప్రారంభంలో టోలోన్యూస్‌లో ప్రెజెంటర్‌గా చేరింది. అక్కడ నెల ఇరువై రోజులు మాత్రమే పనిచేసింది. ఈ లోపు కాబుల్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకొన్నారు.

అఫ్గాన్‌ చరిత్రలో తొలిసారి తాలిబన్‌ ప్రతినిధి టీవీ స్టూడియోలో కూర్చొని ఇంటర్వ్యూ ఇచ్చాడు. అది కూడా ఓ మహిళకి.. వాస్తవానికి ఇది బెహెస్తా అర్ఘాంద్ కి సాహసమనే చెప్పాలి. కానీ, అఫ్గాన్‌ మహిళల కోసం ఆమె ధైర్యం చేశారు. "మనలో ఎవరో ఒకరు ప్రారంభించాలి ... ఇళ్ల వద్దే ఉండిపోయినా.. ఆఫీసులకు వెళ్లకపోయినా తాలిబన్లు నింద మనపై వేస్తారు. మహిళలే ఉద్యోగాలు చేయాలనుకోట్లేదు అన్నట్లుగా చిత్రీకరిస్తారు. అందుకే చివరికి ధైర్యం చేశాను. మా హక్కులు మాకు కావాలి. మేము పని చేయాలనుకుంటున్నాము. సమాజంలో మేము భాగం కావాలని తాలిబన్‌ ప్రతినిధికి చెప్పాను" అని ఆమె వెల్లడించారు. తాలిబన్లు తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటే పరిస్థితులు కచ్ఛితంగా మెరుగుపడతాయని.. తాను సేఫ్ అన్న భావన కలిగిన వెంటనే అఫ్గాన్ కు తిరిగి వస్తానని ఆమె తెలిపారు.


Next Story

RELATED STORIES