గేలానికి చిక్కిన చేప జాలరి గొంతులో..

గేలానికి చిక్కిన చేప జాలరి గొంతులో..
మరో చేప ఊరించింది.. దాన్ని కూడా పట్టుకునే క్రమంలో మొదటి చేపను పంటి కింద పట్టి

గేలానికి ఒక చేప చిక్కింది.. మరో చేప ఊరించింది.. దాన్ని కూడా పట్టుకునే క్రమంలో మొదటి చేపను పంటి కింద పట్టి ఉంచుదామనుకున్నాడు.. అది కాస్తా గొంతులోకి వెళ్లింది.. అతడికి ఊపిరి ఆడక ప్రాణం పోయినంత పనైంది. ఈజిప్టులోని నైలు నది ఒడ్డున ఉన్న స్నూర్ గ్రామం ఉంది. గ్రామానికి చెందిన 40 ఏళ్ల మత్స్యకారుడు చేపలు పట్టడానికి కని గేలం తీసుకుని నదికి వెళ్లాడు.

రెండు గేలాలతో చేపలు పట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక గేలానికి చేప చిక్కింది దాన్ని పైకి తీస్తున్న సమయంలో రెండో గేలానికి మరో చేప చిక్కింది. దాన్ని కూడా పట్టుకోవాలని అనుకున్నాడు.. చేతికి చిక్కిన మొదటి చేప ఎక్కడ జారిపోతుందో అని భావించిన జాలరీ ఆ చేపను నోటితో పట్టుకున్నాడు. అంతే అక్కడి నుంచి నోటిలోపలికి చల్లగా జారుకుంది చేప..

గొంతుకు అడ్డం పడి ఊపిరి ఆడకుండా చేసింది.. తోటి జాలర్లు అతడిని గమనించి వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు ఎండోస్కోపిక్ శస్త్ర చికిత్స చేసి చేపను బయటకు తీశారు. అదృష్టవశాత్తు చేప శ్వాసకోశ నాళాన్ని పూర్తిగా కవర్ చేయలేదు.. లేకపోతే ఆ క్షణమే ఊపిరి పోయేదని డాక్టర్లు వివరించడంతో జాలరి ఊపిరి పీల్చుకున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story