ఒక్క ఆర్డర్.. 42 మంది డెలివరీ

ఒక్క ఆర్డర్.. 42 మంది డెలివరీ
కానీ ఆర్డర్ చేసిన అమ్మాయి డెలివరీ బాయ్‌ల క్యూని చూసి తాను చేసిన పొరపాటుకి ఏం చేయాలో అర్థంకాక తల పట్టుకుంది.

ఆహా ఏం భాగ్యం.. ఈ రోజు బిజినెస్ బ్రహ్మాండంగా ఉంది. ఒక్కసారే ఇన్ని ఆర్డర్లు వచ్చాయని సంతోషపడ్డాడు రెస్టారెంట్ ఓనర్. కానీ ఆర్డర్ చేసిన అమ్మాయి డెలివరీ బాయ్‌ల క్యూని చూసి తాను చేసిన పొరపాటుకి ఏం చేయాలో అర్థంకాక తల పట్టుకుంది. ఫిలిఫ్పైన్స్‌కు చెందిన ఏడేళ్ల బాలికకు చికెన్ ఫ్రైడ్ రైస్ తినాలనిపించింది. బామ్మతో చెబితే సరే ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇవ్వమని చెప్పింది. నెట్ స్లో ఉంది. ఆర్డర్ వెళ్లిందో లేదో అర్థం కాలేదు ఆ చిన్నారికి..

అలా పదే పదే 42 సార్లు ఆర్డర్ ఓకే బటన్‌పై ప్రెస్ చేసింది. దాంతో అరగంటలో 42 మంది డెలివరీ బాయ్‌లు చిన్నారి బుక్ చేసిన చికెన్ ఫ్రైడ్ రైస్ తీసుకుని వచ్చారు. అంతమందిని చూడగానే బామ్మకి, చిన్నారికి ఏం చేయాలో పాలుపోలేదు. ఫిలప్పైన్స్ కరెన్సీలో ఒక ఆర్డర్‌కి 189 పీసోలు కాగా.. 42 ఆర్డర్లకు 7,945 పీసోలుగా మారింది. అంత డబ్బు ఎలా చెల్లించాలి.. అయినా ఇంత ఫుడ్ ఏం చేసుకోవాలి అని కంగారు పడ్డారు బామ్మా, మనవరాలు.. కానీ ఇంతలో వీధిలోని వారంతా తలో చేయి వేసి అందరూ తలో ప్యాకెట్ తీసుకుని వెండనే డెలివరీ బాయ్‌లకు డబ్బులు ఇచ్చేశారు.. ఈ విషయాన్ని ఓ నెటిజన్ ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. ఆన్‌లైన్ కంటే బయటే ఎక్కువ వ్యాపారం జరిగింది అంటూ పోస్ట్ పెట్టాడు.

Tags

Read MoreRead Less
Next Story