ట్రంప్‌పై మరోసారి లైంగిక ఆరోపణలు

X
kasi18 Sep 2020 4:11 AM GMT
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై మరోసారి లైంగిక ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. మాజీ మోడల్ అమీ డోరిస్ (48) ట్రంప్‌పై ఈ ఆరోపణలు చేశారు. తనకు 24 ఏళ్ల వయసులో ట్రంప్ తనను బలవంతంగా ముద్దు పెట్టుకున్నారని ఆమె ఆరోపించారు.. న్యూయార్క్‌లో జరిగిన యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో విఐపి సూట్‌లో ఉన్న ట్రంప్.. తన శరీరాన్ని అనుచితంగా తాకారని ఆరోపించారు.. అంతేకాదు బలవంతంగా ముద్దు పెట్టుకున్నారని ఆరోపించారు. ఆ సమయంలో తన వయసు 24 ఏళ్లు.. ట్రంప్ వయసు సుమారు 51 సంవత్సరాలు అని ఆమె అన్నారు. మరోవైపు అమీ డోరిస్ రాజకీయ దురుద్దేశంతోనే ఈ ఆరోపణల చేస్తున్నారని ట్రంప్ అధికార ప్రతినిధులు చెప్పారు.
Next Story