అంతర్జాతీయం

దయచేసి నా పోర్న్ వీడియోలు పోస్ట్ చేయకండి.. ఓ బిడ్డకు తల్లిని కాబోతున్నా..

పరిస్థితులు మా చేత ఆ పని చేయిస్తాయి. కానీ కాలం గడిచిన కొద్దీ మా వృత్తి మీద మాకు అసహ్యం వేస్తుంది.

దయచేసి నా పోర్న్ వీడియోలు పోస్ట్ చేయకండి.. ఓ బిడ్డకు తల్లిని కాబోతున్నా..
X

పరిస్థితులు మా చేత ఆ పని చేయిస్తాయి. కానీ కాలం గడిచిన కొద్దీ మా వృత్తి మీద మాకు అసహ్యం వేస్తుంది. మాకూ ఓ జీవితం కావాలనిపిస్తుంది.. మాతో జీవితాన్ని పంచుకునే వ్యక్తి కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటాము. మమ్మల్ని అర్థం చేసుకుని అప్యాయంగా అక్కున చేర్చుకునే భాగస్వామి దొరికితే మాకంటే అదృష్టవంతులు ఎవరూ ఉండరు. మేము మా గత జీవితాన్ని మర్చిపోయి భర్త, పిల్లలతో హాయిగా ఉంటున్నా అక్కడక్కడా కొందరు అదే పేరుతో మమ్మల్ని పిలుస్తుంటారు. అది మమ్మల్ని ఎంత బాధిస్తుందో మీకు అర్థం కాదు అని అంటోంది పోర్న్ స్టార్ లానా రోడ్స్.

చికాగో ఇల్లినాయిస్‌లో పుట్టి పెరిగిన 25 ఏళ్ల మాజీ అడల్ట్ స్టార్ అసలు పేరు అమరా మాపుల్. టీనేజ్‌లోనే పోర్న్ స్టార్‌గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి లానా రోడ్స్‌గా ఫేమ్ సంపాదించుకుంది. మొదట మోడలింగ్, యూట్యూబ్, ఇన్‌ప్లుయెన్సర్‌గా పేరు సంపాదించుకుంది. 2016లో అడల్ట్ సినిమాల్లోకి అడుగు పెట్టి రెండేళ్ల పాటు కొనసాగింది. కొంత కాలం క్రితం కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన ఆమె ప్రస్తుతం హ్యారీ జోసే పాడ్‌కాస్ట్ 'టాప్ ఇన్'లో పని చేస్తోంది. తాజాగా తాను గర్భవతిని అని తన పాత వీడియోలను పోస్ట్ చేసి ఇబ్బంది పెట్టవద్దని వేడుకుంటోంది.

ప్రస్తుతం నేను గర్భంతో ఉన్నా. నాకు పుట్టే బిడ్డకు నా గతం గురించి తెలియకుండా ఉండాలని జాగ్రత్త పడుతున్నా. ఒక వేళ తెలిసినా ఆ గుర్తులు అందకూడదనే అనుకుంటున్నా. అందుకే నిజాయితీగా కోరుతున్నా. దయచేసి అడల్ట్ వెబ్‌సైట్లలో ఆ వీడియోలను తొలగించండి. అవకాశం దొరికితే నేనే కాలంలో వెనక్కి వెళ్తా. అలాంటి పనులకు దూరంగా ఉంటా. నా గౌరవాన్ని నేను కాపాడుకుంటా అని పశ్చాత్తప్పడుతోంది లానా. ప్రస్తుతం సెక్స్ వర్కర్స్‌తో మాట్లాడుతూ.. వాళ్ల మానసిక సంఘర్షణను అందరికీ తెలిసేలా ప్రోగ్రాములు చేస్తోంది లానా.

లానా పాపులర్ వ్లోగర్.. అమెరికన్ నటుడు అయిన మైక్ మజ్‌లక్‌తో చాలాకాలంగా సహజీవనం చేస్తోంది.

Next Story

RELATED STORIES