కోమాలోకి వెళ్లిన చిన్నారి.. పాట విని కోలుకుని..

కోమాలోకి వెళ్లిన చిన్నారి.. పాట విని కోలుకుని..
డాక్టర్లు కూడా చేతులెత్తేశారు.. మీ బిడ్డను ఇంటికి తీసుకువెళ్లండి ఎన్ని రోజులు బతుకుతుందో తెలియదు.. మేం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాం అన్నారు.. అమ్మానాన్న ఆ చిన్నారిపై పెట్టుకున్న ఆశలన్నీ వమ్ము చేశారు.

డాక్టర్లు కూడా చేతులెత్తేశారు.. మీ బిడ్డను ఇంటికి తీసుకువెళ్లండి ఎన్ని రోజులు బతుకుతుందో తెలియదు.. మేం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాం అన్నారు.. అమ్మానాన్న ఆ చిన్నారిపై పెట్టుకున్న ఆశలన్నీ వమ్ము చేశారు. ఎప్పటి కైనా బిడ్డ కోమా నుంచి కోలుకుని తమని గుర్తుపడుతుందని తమని నోరారా పిలుస్తుందని ఏదో ఒక మూల చిన్న ఆశ. అందుకే ఆ చిన్నారికి ఇష్టమైన పాటను రోజూ పాడి వినిపించే వారు. ఏదో ఒక చిన్న ప్రయత్నం.. ఏ దేవుడైనా కరుణిస్తాడేమోనని. తమ ప్రయత్నం వృధా పోలేదు. కోమాలోకి వెళ్లిన బిడ్డ కోలుకుంది.. వైద్యులకే సవాల్ విసిరింది.

బ్రిటన్‌‌కు చెందిన నాలుగేళ్ల బాలిక తన తల్లిదండ్రుల పాట వింటూ మరణాన్ని అధిగమించి కోమా నుంచి బయటకు వచ్చింది. చిన్నారి పేరు మిల్లీ మోరన్. మిల్లీ మోరన్ పుట్టినప్పటి నుండి తరచూ అనారోగ్యానికి గురవుతూ ఉండేది. అమ్మానాన్నలిద్దరికీ ఆస్పత్రుల చుట్టూ తిరిగే పనే ఎక్కువగా ఉండేది మిల్లీ ఆరోగ్యం కోసం.

మిల్లీకి పుట్టినప్పటి నుండి వెన్నుపూస మధ్య ఎనిమిది సెంటీమీటర్ల అంతరం ఉంది. అదే సమయంలో చిన్నారి లివర్ కూడా దెబ్బతింది. వీటితో పాటు మరికొన్ని అనారోగ్య సమస్యలు చిన్నారిని చుట్టుముట్టాయి. 22 డిసెంబర్ 2014 న తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో మిల్లీని ఆసుపత్రిలో చేర్పించారు తల్లిదండ్రులు. ఆ సమయంలో చిన్నారికి ఛాతీలో ఇన్ఫెక్షన్ వచ్చింది.

క్రిస్మస్ రోజున, మిల్లీ లంగ్స్ కూడా పనిచేయడం మానేశాయి. దాంతో మిల్లీ కోమాలోకి వెళ్ళింది. వైద్యులు ఓటమిని అంగీకరించారు కాని మిల్లీ తల్లిదండ్రులు వదల్లేదు. తల్లి ఎమ్మా జెన్నీ, తండ్రి మైఖేల్ మోరెన్ డిస్ మెషిన్ పాటను మెషిన్ మైక్రోఫోన్‌లో పాడారు.

మిల్లీకి ఆ పాట అంటే చాలా ఇష్టం. దాంతో తల్లిదండ్రులిద్దరు పాటను పాడటం కొనసాగించారు. ఈ పాట విన్నకొన్ని రోజుల తర్వాత మిల్లి కోమా నుండి బయటకు వచ్చింది. మిల్లీ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, కోమాలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు పాడిన పాట తన చెవులను తాకిందని చెప్పింది. తమ బిడ్డను పాట బతికించిందని ఎమ్మా, మైఖేల్ ఉప్పొంగి పోతున్నారు. తమ మొర ఆలకించి బిడ్డను బతికించినందుకు దేవుడికి ధన్యవాదులు చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story