JAPAN: రేపటి నుంచే సముద్రంలోకి అణు వ్యర్థజలాలు

JAPAN: రేపటి నుంచే సముద్రంలోకి అణు వ్యర్థజలాలు
పసిఫిక్‌ మహా సముద్రం( Pacific Ocean)లోకి విడుదల చేయనున్న జపాన్‌... తీవ్రంగా వ్యతిరేకిస్తున్న చైనా, దక్షిణకొరియా

2011లో సంభవించిన సునామీ కారణంగా జపాన్‌(Japan)లో దెబ్బతిన్న ఫుకుషిమా అణు విద్యుత్‌ కేంద్రం‍(Fukushima Daiichi nuclear plant)లో పేరుకుపోయిన వ్యర్థ జలాలను( releasing radioactive wastewater) గురువారం నుంచి పసిఫిక్‌ మహా సముద్రం( Pacific Ocean)లోకి విడుదల చేయనున్నారు. అణు వ్యర్థజలాలను పసిఫిక్‌ మహా సముద్రంలోకి విడుదల చేయనుండటంపై తీవ్ర విమర్శలు(controversial ) వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ప్లాంటు మూసివేయటానికి వ్యర్థజలాల విడుదల అనివార్యమని జపాన్‌ తన చర్యను సమర్థించుకుంటోంది. ప్రజల భద్రత, మత్స్యసంపద దెబ్బతినకుండా అన్నిచర్యలు తీసుకున్నట్లు జపాన్ పేర్కొంది. ఈ నిర్ణయంపై ఆందోళన వ్యక్తంచేస్తున్న చైనా, దక్షిణ కొరియా సహా చాలా ద్వీప దేశాలు ఫుకుషిమా అణు విద్యుత్తు కేంద్రం సమీపంలో పట్టిన చేపల దిగుమతులపై నిషేధం విధించాయి.


ప్రజల భద్రతను నిర్ధారించటంతోపాటు మత్స్యసంపద దెబ్బతినకుండా ఎదుర్కోవటానికి అన్ని చర్యలు తీసుకున్నామని జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదా(Prime Minister Fumio Kishida) తెలిపారు. జపాన్‌తోపాటు బయటి దేశాలు శాస్త్రీయ వివరణపై అవగాహన పెంచుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. దశాబ్దాల సమయం పట్టే వ్యర్థ అణుజలాల విడుదల పూర్తి చేయటానికి, ఫుకుషిమా అణువిద్యుత్తు కేంద్రం మూసివేసే వరకు ప్రభుత్వం తన ప్రయత్నాలు కొనసాగిస్తుందన్నారు. ఈ ప్లాంట్‌ను మూసివేయాలంటే నీటిని విడుదల చేయాల్సిందేనని జపాన్‌ ప్రధాని(Mr. Kishida) స్పష్టం చేశారు. టోక్యో ఎలక్ట్రిక్‌ పవర్‌ కంపెనీ ఈ నీటిని వడగట్టి 60రకాల రేడియో యాక్టివ్‌ పదార్థాలను తొలిగిస్తున్నట్లు చెప్పారు.


ఫుకుషిమా అణు విద్యుత్‌ కేంద్రంలో పేరుకుపోయిన వ్యర్థ జలాలను విడుదల చేయడాన్ని చుట్టుపక్కల దేశాలన్నీ తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా ఐరాస పర్యవేక్షక సంస్థ- ఐఏఈఏ( International Atomic Energy Agency) మాత్రం వ్యర్థ అణుజలాలను సముద్రంలోకి విడుదల చేసేందుకు అనుమతి మంజూరు చేసింది. జపాన్‌ వద్ద శుద్ధి చేసినట్లు చెబుతున్న 1.34 మిలియన్‌ టన్నుల(1.34 million tons)అణుజలాలు ఉన్నాయి. ఇవి 5వందల ఒలింపిక్స్‌ సైజు స్విమ్మింగ్‌ పూల్స్‌కు సమానం. 2011లో వచ్చిన సునామీ వల్ల ఫుకుషిమా అణువిద్యుత్తు కేంద్రం దెబ్బతినటంతో అప్పటి నుంచి ఆ వ్యర్థజలాలను జపాన్‌ నిల్వచేసింది. ఇప్పుడు స్థలం సరిపోని పరిస్థితి ఏర్పడింది. దీంతో అణుజలాలను వివిధ దశల్లో శుద్ధిచేసి రాబోయే 30ఏళ్లు సముద్రంలోకి విడుదల చేయనున్నారు. 2011లో వచ్చి న భారీ భూకంపం ధాటికి ఫుకుషిమా అణు విద్యుత్తు ప్లాంట్‌ దెబ్బతిన్నది.


ఒకప్పటి సోవియట్‌లోని చర్నోబిల్‌ తర్వాత ఇదే అతిపెద్ద అణుప్రమాదం ఇది. సుమారు లక్షన్నర మంది ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. అణుజలాల కారణంగా మత్స్యసంపదకు డిమాండ్‌ పడిపోతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా చైనా, దక్షిణ కొరియా తదితర దేశాలు వ్యర్థ అణుజలాలను సముద్రంలోకి విడుదల చేయటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story