France: ఫ్రాన్స్‌కు తొలి ‘గే’ ప్రధాని..

France: ఫ్రాన్స్‌కు తొలి ‘గే’ ప్రధాని..
యంగెస్ట్ పీఎం కూడా..

ఫ్రాన్స్‌ నూతన ప్రధానిగా 34 ఏండ్ల గాబ్రియెల్‌ అట్టల్‌ నియమితులయ్యారు. ఈ పదవి చేపట్టిన అత్యంత పిన్న వయస్కుడు, తొలి గే వ్యక్తిగా అట్టల్‌ నిలిచారు. పెన్షన్‌, వలస నిబంధనల్ని మరింత కఠినతరం చేస్తూ మాక్రాన్‌ సర్కార్‌ సంస్కరణలకు తెరలేపటాన్ని వ్యతిరేకిస్తూ దేశ ప్రధాని పదవికి ఎలిసాబెత్‌ బోర్న్‌ సోమవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. దేశ ప్రధాన మంత్రిగా తొలిసారి ఓ స్వలింగ సంపర్కుడిని ప్రతిపాదించారు. 34 ఏళ్ల గాబ్రియేల్ అట్టల్‌‌ను ప్రధానిగా ఎంపిక చేశారు. గాబ్రియేల్ స్వలింగ సంపర్కుడే కాదు.. అతిపిన్న వయస్కుడైన తొలి ఫ్రాన్స్ ప్రధాని కానుండటం విశేషం.. ప్రధాని కాబోతున్న గ్యాబ్రియేల్ అట్టల్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఫ్రాన్స్ కు అత్యంత పిన్న వయస్కుడైన ప్రధాని మాత్రమే కాదు తాను స్వలింగ సంపర్కుడినని స్వయంగా ప్రకటించిన ప్రభుత్వ అధిపతిగా కూడా నిలిచారు.

ఫ్రాన్స్ ఆరోగ్య శాఖలో పదేళ్ల కిందట సలహాదారుగా పనిచేసిన అట్టల్.. సోషలిస్టు పార్టీలో సామాన్య కార్యకర్తగా ఉండేవారు. ప్రస్తుతం మెక్రాన్ సర్కారులో ఆయన విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ప్రధాని ఎలిజబెత్ బోర్న్(62) సోమవారం రాజీనామా చేయడంతో కొత్త ప్రధాన మంత్రి ఎంపిక అనివార్యమైంది. రెండేళ్ల ముందే పదవికి ఆమె రాజీనామా చేయగా.. అధ్యక్షుడు మెక్రాన్ ఆమోదించారు. ఈ ఏడాది జూన్‌లో యూరోపియన్ పార్లమెంట్ ఎన్నికలు, జరగనుండగా.. వరుసగా రెండోసారి కూడా గెలవాలనే సంకల్పంతో ఆయన ఉన్నారు.

అలాగే, 2024 ఒలింపిక్స్‌‌ను పారిస్ వేదికగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రివర్గ పునర్వవస్థీకరణకు ఆయన సిద్ధమవుతున్నారు. ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న విమర్శలకు కొత్త మంత్రివర్గం కూర్పుతో బదులివ్వాలని ఆయన భావిస్తున్నారు. బోర్న్ కఠిన, అర్ధంలేని ప్రవర్తనకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో పదవి నుంచి తప్పించినట్టు తెలుస్తోంది. అట్టల్ మెక్రాన్ ప్రభుత్వంలో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తి. కానీ, అట్టల్‌ను ప్రధానిగా నియమించడంపై పలువురు అసంతృప్తిగా ఉన్నారనే చర్చకు ఆజ్యం పోసింది. అంతర్గత మంత్రి గెరాల్డ్ డార్మానిన్, ఆర్థిక మంత్రి బ్రూనో లే మైర్‌ సన్నిహిత వర్గాలు దీనిని తీవ్రంగా ఖండించాయి.

Tags

Read MoreRead Less
Next Story