Germany: కలవర పెట్టిన రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు

Germany: కలవర పెట్టిన  రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు
13 వేల మంది ప్రజల తరలింపు

జర్మనీలోని ఓ పేలుడు పదార్ధం కలకలం రేపింది. డస్సెల్ డార్ఫ్ నగరంలో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు అందరినీ కలవర పెట్టేసింది. ఒక టన్ను బరువుగల ఈ పేలుడు పదార్ధాన్ని సిటీలోని జూ సమీపంలో గుర్తించారు. అది ఉన్న ప్రాంతానికి 500 మీటర్ల పరిధిలో ఉన్న ప్రజలందరినీ అధికారులు అక్కడి నుంచి హుటాహుటిన ఖాళీ చేయించారు. రోడ్లను మూసివేశారు. బాంబ్ స్క్వాడ్ రంగంలోకి దిగి దాన్ని డిస్పోజ్ చేసే ఆపరేషన్ మొదలుపెట్టారు.

ఒక జర్మన్ పత్రిక విడుదల చేసిన కథనం ప్రకారం 1940 - 1945 మధ్య కాలంలో రెండో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు బ్రిటీష్, యూఎస్ ఎయిర్ ఫోర్స్ లు యూరప్ పై మొత్తంగా 2.7 టన్నుల బాంబులను జారవిడిచాయి. వీటిలో సగం జర్మనీపై వేశారు. ఈ దెబ్బకి 1945 మేలో జర్మనీలోని నాజీ ప్రభుత్వం సరెండర్ అయ్యే సమయానికి ఆ దేశంలోని పారిశ్రామిక మౌళిక సదుపాయాలు మొత్తం నాశనమయ్యాయి. డజన్ల కొద్దీ నగరాలు బూడిదగా మారాయి. హిట్లర్ 1945 ఏప్రిల్ 30న ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఆ తరువాత మే 8న, జర్మనీ లొంగుబాటు ఒప్పందంపై సంతకం చెయ్యడంతో ఐరోపాలో యుద్ధం ముగిసింది.


మరోవైపు, 2021 డిసెంబర్ లో మ్యూనిక్ స్టేషన్ సమీపంలోని ఒక కన్స్ స్ట్రక్షన్ సైట్ వద్ద రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు పేలింది. ఈ పేలుడులో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. 2017 సెప్టెంబర్‌లో ఫ్రాంక్‌ఫర్ట్ నగరంలో కూడా రెండో ప్రపంచ యుద్ధం బాంబు ఒకటి లభించింది. దీంతో దాదాపు 70 వేల మంది ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. మరోసారి బెర్లిన్‌ ప్రధాన రైల్వే స్టేషన్‌ను కూడా ఇదేవిధంగా ఖాళీ చేయించారు. అప్పట్లో సరిగ్గా ఇలాగే 500 కేజీల బరువున్న బాంబును నిర్మాణ కార్మికులు కనుగొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story