Germany: హాంబర్గ్ విమానాశ్రయంలో ఆగంతకుడి కాల్పులు..

Germany: హాంబర్గ్ విమానాశ్రయంలో ఆగంతకుడి కాల్పులు..
ఎయిర్‌పోర్టులో విమాన సేవలు నిలిపివేత

జర్మనీలోని హాంబర్గ్ ఎయిర్‌పోర్టులో ఒక్కసారిగా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆయుధాలతో కూడిన వాహనంతో ఓ వ్యక్తి ఎయిర్‌పోర్టు లోపలికి దూసుకెళ్లాడు. సెక్యూరిటీని దాటుకొని వాహనాన్ని ఎయిర్‌పోర్టు టార్మాక్‌పైకి తీసుకెళ్లి నిలిపాడు. నిందితుడు తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపాడని, మండుతున్న బాటిల్ ఒక దానిని బయటకు విసిరేశాడని పోలీసులు ప్రకటించారు. వాహనంలో ఇద్దరు చిన్నారులు బంధీలుగా ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. భద్రతా కారణాల దృష్టా విమానాశ్రయంలో విమానాల రాకపోకలు నిలిపివేశాడు.

విమానాశ్రయం భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆగంతకుడు ఎయిర్‌పోర్టులోనే ఉండటంతో గేట్లు మూసివేశారు. ఆగంతకుడు కారులో అక్కడికి వచ్చాడని, భద్రతను దాటుకుని టెర్మినల్ 1 వైపు దూసుకొచ్చాడని వార్తాసంస్థ ఏఎన్ఐ తెలిపింది. అనంతరం ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఏరియాలోకి చేరుకున్నాడని జర్మనీ మీడియా తెలిపింది.అయితే కాల్పులకు పాల్పడిన వ్యక్తి కారులో అతని కూతురు ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. తన కూతురు కనిపించడం లేదని ఇప్పటికే 'నిందితుడి భార్య' ఫిర్యాదు చేశారు. జర్మనీ కాలమానం ప్రకారం శనివారం రాత్రి 8 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. వెంటనే ప్రత్యేక బలగాలు అక్కడికి చేరుకున్నాయి. కాగా నిందితుడి భార్య పిల్లలు కనిపించడంలేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తోందని, దంపతుల మధ్య పిల్లల సంరక్షణకు సంబంధించిన వివాదం అయ్యుండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.


ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా వివరాలు వెల్లడించారు. కాగా ఈ అనూహ్య పరిస్థితి కారణంగా హాంబర్గ్ విమానాశ్రయంలోని అన్ని విమానాలు సర్వీసులు ప్రస్తుతానికి నిలిచిపోయాయి. అన్ని టెర్మినల్స్‌పై ప్రవేశాలను మూసివేశారు. ప్రస్తుతానికి సర్వీసుల పునరుద్ధరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ప్రయాణికులందరూ ఎయిర్‌పోర్ట్‌ను ఖాళీ చేసి వెళ్లినందున ఇతరులకు హాని జరిగే సూచనలు లేవని పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల ఘటనలో 27 విమానాల టైమింగ్ లు దెబ్బతిన్నాయని విమానాశ్రయ ప్రతినిధి చెప్పారు. పోలీసులు పెద్ద ఎత్తున విమానాశ్రయానికి వచ్చారు. ఈ ఘటనకు కారణాలపై జర్మనీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనుమానితుడు ఇప్పటికే రెండు సార్లు కాల్పులు జరపడం, కొన్ని సీసాలకు నిప్పంటించి బయటకు విసరడం వంటి చర్యలకు పాల్పడ్డాడు. దీంతో ప్రత్యేక దళాలను కూడా అక్కడకు తరలించారు. దీంతోపాటు మానసికి నిపుణులు, సీనియర్ అధికారులు ఆ దండగుడితో చర్చలు జరిపేందుకు అక్కడికి చేరుకొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story