గూగుల్ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్..

గూగుల్ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్..
ప్రస్తుతం ఈ రైడ్ సర్వీస్ సెట్టింగ్ ఉబెర్‌కు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అయితే ఈ సర్వీసులు ఒక్కో

గూగుల్ మ్యాప్స్ సరికొత్త అప్‌డేట్‌ను తీసుకొస్తోంది. తాజా నివేదిక ప్రకారం గూగుల్ మ్యాప్స్‌లో రైడ్ సర్వీసెస్ అనే కొత్త సర్వీస్‌ని తీసుకురాబోతోంది. మ్యాప్స్ నుండి రైడ్-షేరింగ్ కంపెనీకి రూట్ సమాచారాన్ని పంపడం ద్వారా ఎంత ఛార్జ్ చేస్తున్నారో కచ్చితంగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ రైడ్ సర్వీస్ సెట్టింగ్ ఉబెర్‌కు మాత్రమే సపోర్ట్ చేస్తుంది.

అయితే ఈ సర్వీసులు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటాయి. అయితే అది ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. త్వరలో ఈ సేవలు మరింత మందికి అందుబాటులోకి రానున్నాయి. గూగుల్ మ్యాప్స్ యొక్క తాజా బీటా వెర్షన్‌లో బిల్డింగ్ నంబర్లు, క్రాస్ వాక్ గుర్తులను జోడించినట్లు తెలిపింది. పరిమిత నగరాల కోసం అందుబాటులో ఉన్న ఈ సేవలు త్వరలో మరిన్ని నగరాలకు విస్తరించనున్నట్లు సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story