Greece: విస్తరిస్తున్న కార్చిచ్చు

Greece: విస్తరిస్తున్న కార్చిచ్చు
జాతీయ రహదారి మూసివేత, సురక్షిత ప్రాంతాలకు వేలాదిమంది...

గ్రీస్ రాజధాని ఏథెన్స్ కు సమీపంలోని అడవుల్లో రాజుకున్న కార్చిచ్చు అంతకంతకూ విస్తరిస్తోంది. ఫలితంగా తీర ప్రాంతంలోని రిసార్టుల్లో ఉన్న వేలాది మందిని ఖాళీ చేయించాల్సి వచ్చింది. జాతీయ రహదారులను మూసివేయాల్సి వచ్చింది. పర్యాటక గృహాలు మంటల్లో కాలి బూడిదయ్యాయి. ఏథెన్స్ కు 40 కిలోమీటర్ల దూరంలో ఒకటి, 90 కిలోమీటర్ల దూరంలో మరొకటి అడవుల్లో మంటలు రాజుకుని... విస్తరిస్తున్నాయి. వాటిని ఆర్పేందుకు సైన్యం, పోలీసు ప్రత్యేక బలగాలు, వాలంటీర్లు రంగంలోకి దిగారు.


వృద్ధులను, క్రైస్తవ సన్యాసులు, గుర్రాలను కాపాడారు. లాగొనిసి అడవుల్లో కార్చిచ్చును ఆపేందుకు హెలికాప్టర్లు ద్వారా నీటిని చల్లుతున్నారు. పశ్చిమాన ఉన్న లౌత్రకిలోనుపిల్లల క్యాంపులను ఖాళీ చేయించారు. ప్రమాద ప్రాంతాల్లో చిక్కుక్కున్న వారికి..... గ్రీస్ పౌర రక్షణ శాఖ ఫోన్ సందేశాలను పంపింది. ఇప్పటికే అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న గ్రీస్ లో మరో 4 రోజుల పాటు వేడిగాలులు కొనసాగవచ్చని అధికారులు తెలిపారు. వడగాల్పులకు తోడు అడవుల్లో రాజుకున్న మంటలు గ్రీస్ ప్రజల పరిస్థితిని మరింత దుర్బరంగా మార్చాయి.

Tags

Read MoreRead Less
Next Story