Gunnies Record: నీట మునిగి... ముద్దులాడి... రికార్డ్ నెలకొల్పెనట...

Gunnies Record: నీట మునిగి... ముద్దులాడి... రికార్డ్ నెలకొల్పెనట...
ఒక్క ముద్దుతో గిన్నిస్ బుక్కునెక్కిన జంట; వరల్డ్ లాంగెస్ట్ అండర్ వాటర్ కిస్సు మరి.....

ప్రపంచంలో తమ ప్రేమే గొప్పదని నిరూపించుకోవాలనుకుంది ఆ జంట. అందుకు ఏదైనా కొత్తగా ట్రై చేయాలనుకుంది. ఇందుకు ప్రేమికుల దినోత్సవం రోజు మూహూర్తం పెట్టుకుంది. ఇంకేముంది... చక్కగా నీట మునిగింది. ఇంత ప్లాన్ చేసింది ఏట్లో దూకడానికా అని మరీ ఆశ్చర్యపోవద్దు. అసలు విషయం అదే మరి. నీటి అడుగున నాలుగు నిమిషాల ఆరు సెకండ్ల పాటూ నిర్వీరామంగా ముద్దాడేసి సరికొత్త గిన్నిస్ రికార్డ్ ను నెలకొల్పింది ఈ జంట. దక్షిణాఫ్రికాకు చెందిన బెత్ నీలే, మైల్స్ కౌల్టియర్ ప్రొఫెషనల్ డైవర్లు. వీరికి ఓ పాపాయి కూడా ఉంది. ఇక ప్రేమికుల దినోత్సవం పురస్కరించుకుని అండర్ వాటర్ కిస్ ఛాలెంజ్ ను స్వీకరించాలని నిర్ణయించుకన్న బెత్, మైల్స్ ఈ మేరకు సన్నద్ధం అయ్యారు. రికార్డ్ నెలకొల్పే ముందు రెండు మూడు ట్రైల్స్ వేసుకుని, ఫైనల్ కిస్ కు ఉపక్రమించారు. మొత్తానికి నాగులు నిమిషాల పాటు ముద్దాడి... 13ఏళ్ల క్రితం నమోదైన 3 నిమిషాల 24 సెకండ్ల ముద్దు రికార్డ్ ను బ్రేక్ చేసి... కొత్త రికార్డ్ ను నెలకొల్పారు. ఈ మేరకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులు వీరి ఫీట్ ను గుర్తించి పత్రాలను బహూకరించారు. ఇక ఇద్దరూ ప్రొఫెషనల్ డైవర్లే అయినప్పటికీ ఈ రికార్డ్ నెలకొల్పడం ఆసాధ్యమనే భావించినట్లు వెల్లడించారు. కానీ, ఎట్టకేలకు ఇది సాధ్యమైందని హర్షం వ్యక్తం చేశారు. మరి ఈ రికార్డ్ ను తలదన్నెవారెవరైనా పుట్టుకొస్తారేమో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story