Hamas New Submarine Drone : హమాస్ అమ్ముల పొదిలో సరి కొత్త ఆయుధం

Hamas New Submarine Drone :  హమాస్ అమ్ముల పొదిలో సరి  కొత్త ఆయుధం
అల్-అసెఫ్ గైడెడ్ ‘టార్పెడో’

అక్టోబర్ 7వ తేదీన మొదలైన ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. తొలుత హమాస్ ఈ యుద్ధానికి శంఖం పూరించగా.. ఇజ్రాయెల్ అందుకు ప్రతీకారం తీర్చుకుంటోంది. హమాస్‌ని పూర్తిగా సర్వనాశనం చేయాలన్న లక్ష్యంతో ముందుకు దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఒక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. హమాస్ అమ్ముల పొదిలో కొత్త సబ్ మెరైన్ డ్రోన్ ఆయుధం టార్పెడో ఉంది. ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య గాజాలో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో హమాస్ తన అల్-అసెఫ్ గైడెడ్ ‘టార్పెడో’ వీడియోను మంగళవారం విడుదల చేసింది. ఈ కొత్త సబ్‌మెరైన్ డ్రోన్ వెపన్ ను ఇజ్రాయెల్ యుద్ధంలో ఉపయోగిస్తామని హమాస్ పేర్కొంది. నీటి అడుగున ఉండే ఈ డ్రోన్లు శత్రు వాహనాలపై దాడులు చేయనున్నాయి.

ఈ డ్రోన్లను ఇజ్రాయెల్ లక్ష్యాలను తిప్పికొడతాయని హమాస్ తెలిపింది. టార్పెడో మెటల్ కవచంతో కంప్రెస్డ్ గ్యాస్ సిలిండరును పోలీ ఉంటుంది. అల్-కస్సామ్ బ్రిగేడ్స్‌కు చెందిన నలుగురు హమాస్ డైవర్లు ఈ కొత్త ఆయుధాన్ని నీటిలోకి తీసుకువెళ్లారు. ఈ ఆయుధాన్ని 2023 అక్టోబర్ 7వతేదీన గాజా నుంచి ఇజ్రాయెల్‌పై హమాస్ నేతృత్వంలోని దాడి సమయంలో ఉపయోగించారు.


హమాస్ ఇదే ఆయుధంతో ఇజ్రాయెల్ నౌకాదళ ఆస్తులపై దాడి చేయడానికి ప్రయత్నించిందని వెల్లడైంది. టార్పెడోలు నీటి అడుగున డ్రోన్‌ల లక్షణాలను మిళితం చేసే ఇలాంటి ఆయుధాలను ఇరాన్, ఉత్తర కొరియా దేశాలు నిర్మించాయి. కాగా అమెరికా అధికారులను హత్య చేసేందుకు ఇరాన్ పన్నాగం పన్నుతుందని ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టోఫర్ వ్రే ఆరోపించారు.

సెనేట్ విచారణ సందర్భంగా తీవ్రవాద ముప్పు పెరుగుతుందని ఆయన హెచ్చరించారు. ఇరాన్ మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలకు ఆజ్యం పోస్తుందని అమెరికా పదేపదే ఆరోపించింది.

ఇదిలావుండగా.. తొలుత హమాస్ ఈ యుద్ధ బేరి మోగించింది. నిమిషాల వ్యవధిలో 5 వేలకు పైగా రాకెట్లను ప్రయోగించింది. ఈ దాడిలో వందలాది మంది మరణించారు. అంతేకాదు.. భూమి, వాయు, జల మార్గాల ద్వారా హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌లోకి చొరబడి, వందలాది మందిని బందీలుగా తీసుకెళ్లారు. దీంతో మండిపడ్డ ఇజ్రాయెల్.. హమాస్‌తో యుద్ధం ప్రకటించి, ఆ సంస్థను తుడిచిపెట్టేయాలన్న లక్ష్యంతో దాడులు నిర్వహిస్తోంది. ఇప్పటికే హమాస్‌కి చెందిన ఎన్నో రహస్య స్థావరాల్ని ధ్వంసం చేసింది. ఆహారం, ఇంధనం, విద్యుత్‌లపై నిషేధం విధించి.. గాజాను దిగ్బంధించింది.

Tags

Read MoreRead Less
Next Story