Hawaii wildfires: బూడిద కుప్పగా హవాయి

Hawaii wildfires: బూడిద కుప్పగా హవాయి
భీకరమైన కార్చిచ్చు ఘటనలో 93కు పెరిగిన మృతులు... మంటల ధాటికి కరిగిపోయిన లోహాలు

ఒకప్పుడు పర్యాటకులతో కళకళలాడిన అమెరికాలోని హవాయి(Hawaii wildfires) ఇప్పుడు మౌనంగా రోదిస్తోంది. అగ్నికీలల ధాటికి ఇక్కడి లహైన్‌ రిసార్టు నగరం(historic town of Lahaina ) బూడిదకుప్పగా మారింది. మావీయ్‌ దీవి( Hawaiian island of Maui)లో మంటల కారణంగా మరణించిన వారి సంఖ్య 93కి(at least 93 people) పెరిగింది. మృతుల్లో ఇప్పటివరకు ఇద్దరిని మాత్రమే అధికారులు( find and identify the dead ) గుర్తించారు. లోహాలు సైతం కరిగిపోయిన ఈ ప్రమాదం(deadliest wildfire)లో మిగిలిన వారి శరీర భాగాలను గుర్తించేందుకు DNA పరీక్షలకు పంపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. గాయపడ్డ వారి సంఖ్యకు లెక్కేలేదు. ఈ కార్చిచ్చులో ఎంతమంది చనిపోయారో కచ్చితంగా తెలుసుకునేందుకు మరికొన్ని రోజులు పడుతుందని అధికార యంత్రాంగం తెలిపింది. మావీయ్‌ దీవిలో మృతులను గుర్తించేందుకు పోలీసు జాగిలాలతో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.


మంటల ధాటికి మావీయ్‌ దీవి ఆనవాళ్లు లేకుండా మారిపోయాయి. ఈ దీవిలో ఈనెల 7వ తేదీ రాత్రి నుంచి అది భీకర రూపం దాల్చి అక్కడి వారికి అంతులేని దుఃఖాన్ని మిగిల్చింది. హరికేన్‌ ప్రభావంతో బలమైన గాలులు వీచి, కార్చిచ్చు వేగంగా విస్తరిస్తోంది. కార్చిచ్చు ధాటికి వీధుల్లో దట్టమైన పొగ అలముకుంది. మంటలు నలువైపులా చుట్టుముట్టడంతో హవాయిలోని పశ్చిమ భాగానికి ఇతర ప్రాంతాలతో సంబంధాలు దాదాపుగా తెగిపోయాయి. పొగ, మంటల బారి నుంచి తప్పించుకునేందుకు కొంత మంది స్థానికులు పసిఫిక్‌ మహాసముద్రంలోకి దూకడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. 16రహదారులను మూసివేశారు. కేవలం ఒకే హైవే అందుబాటులో ఉంది. ఆ మార్గంలోనే బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

కార్చిచ్చు కారణంగా మావీయ్ దీవిలో 50వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించిందని అధికారులు ప్రకటించారు. అమెరికా ఫెడరల్‌ ఎమర్జెన్సీ ఏజెన్సీ ఇప్పటికే 5.2బిలియన్‌ డాలర్ల నష్టం అంచనాలను సిద్దం చేసింది. మొత్తం 2వేల 2వందల నిర్మాణాలు పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రాంతంలో ముమ్మర సహాయ చర్యలను కొనసాగిస్తున్నారు. పదుల సంఖ్యలో అగ్నిమాపక శకటాలతో మంటలను ఆర్పుతున్నారు. వాహనాలు వెళ్లలేని ప్రాంతంలో హెలికాప్టర్ల సాయంతో అగ్నికీలలను అదుపు చేస్తున్నారు. అయితే సిబ్బంది కొరత, పరికరాల కొరత సహాయ చర్యలకు ఆటంకంగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story