Peru Health Emergency : పెరు లో హెల్త్ ఎమర్జెన్సీ

Peru Health Emergency : పెరు లో హెల్త్ ఎమర్జెన్సీ
పెరుగుతున్న గులియన్‌ బ్యారీ సిండ్రోమ్‌ కేసులతో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు

అరుదైన న్యూరోలాజికల్ డిజార్డర్ గులియన్‌ బ్యారీ సిండ్రోమ్‌ కేసులు పెరుగుతుండటంతో పెరు ప్రభుత్వం జూలై 8వ తేదీ నుంచి 90 రోజులపాటు దేశవ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ ని ప్రకటించింది. మనిషి సొంత వ్యాధినిరోధక శక్తి వల్లే అనారోగ్యానికి గురయ్యే రుగ్మతను గులియన్‌ బ్యారీ సిండ్రోమ్‌ అంటారు. ఇందులో బాధితులు చూడ్డానికి బాగానే కనిపిస్తుంటారు. కానీ వాళ్ళ శరీరం కాళ్ల దగ్గర్నుంచి అచేతనం కావడం మొదలై క్రమంగా పైపైకి పాకుతూ ఉంటుంది. గతంలో చాలా అరుదుగా మాత్రమే కనిపించే ఈ రుగ్మత ఇటీవల చాలామందిలో కనిపించడంతో పెరు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

గులియన్‌ బ్యారీ సిండ్రోమ్‌ వచ్చిన 70 శాతం మందిలో సాధారణంగా రెండు వారాల్లో వారు నడవలేని పరిస్థితికి చేరుకునే అవకాశాలు ఎక్కువ. దాదాపు ఒక నెల రోజులు మొదలుకొని ఆర్నెల్ల తర్వాత వారు కోలుకుని పూర్తిగా నార్మల్‌ కాగలరు. అయితే 10 శాతం మందిలో మాత్రం సమస్య మరింత ముదిరి శ్వాస తీసుకోడానికి ఉపయోగపడే కండరాలు కూడా చచ్చుబడిపోతాయి. దాంతో ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. ఇలాంటి వారు మింగే శక్తిని కూడా కోల్పోతారు. బాధితులు ఇలాంటి దశకు చేరుకుంటే మాత్రం వెంటిలేటర్‌ పెట్టి చికిత్స అందించాలి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వేరే ప్రభుత్వం జీబీ సిండ్రోమ్ నుంచి రక్షణ, ఇతర కార్యక్రమాలకోసం 3.27 మిలియన్ డాలర్లను కేటాయించింది.




ఈ వ్యాధి తీవ్రత చాలా తక్కువ మొదలు కొని చాలా క్రిటికల్ కూడా అవ్వచ్చు. తీవ్రత మరింత ఎక్కువగా ఉంటే కాళ్లూ, చేతులకు తిమ్మిర్లు, స్పర్శ తెలియకపోవడం, గుండె స్పందనల వేగం తగ్గడం, బీపీలో మార్పులు, కాస్త అరుదుగా మూత్రం కండరాలపైనా పట్టుకోల్పోవడం కూడా జరగవచ్చు.

ఒక్కోసారి బాధితులు కొంతకాలం అచేతనంగా ఉండి ఆ తర్వాత మళ్లీ కోలుకోవడం కూడా జరుగుతుంది. అయితే కొంతమందిలో శ్వాసకోశ వ్యవస్థకు సంబంధించిన సిగ్నల్స్‌ అందకపోవడం జరిగితే అది ప్రమాదకరమైన పరిస్థితికి దారితీవయచ్చు. నిజానికి దీనికి ప్రత్యేకమైన చికిత్స అంటూ ఏమీ లేదు. ఎప్పటికప్పుడు రోగిని పరిశీలించడం దాని ద్వారా తక్షణ చికిత్స అందించడమే అవసరం.

జూన్ 2023 నుంచి పెరులో దేశవ్యాప్తంగా 182 కేసులు నమోదవగా, ఇప్పటికి 147 మంది డిశ్చార్జ్ అయ్యారు. 31 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండగా నలుగురు మరణించారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా పెరు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Tags

Read MoreRead Less
Next Story