ఆఫ్ఘన్ అమ్మాయి కన్నీళ్లు.. హృదయ విదారక వీడియో వైరల్

ఆఫ్ఘన్ అమ్మాయి కన్నీళ్లు.. హృదయ విదారక వీడియో వైరల్

అమెరికా సైన్యం ఉపసంహరించుకున్న తర్వాత దేశాన్ని నియంత్రించడానికి తీవ్ర యుద్ధం చేసిన తాలిబన్ ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకుంది. తాలిబన్ దళాలు దేశాన్ని స్వాధీనం చేసుకున్న వివిధ వీడియోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ దృశ్యాలను ప్రపంచం దూరం నుండి చూస్తోంది.

ఇరాన్ జర్నలిస్ట్ మరియు కార్యకర్త మసిహ్ అలినజాద్ ట్విట్టర్‌లో ఒక ఆఫ్ఘని అమ్మాయి యొక్క హృదయ విదారక వీడియోను పోస్ట్ చేశారు. అక్కడ ఆమె ఆఫ్ఘనిస్తాన్‌తో ప్రపంచం ఎలా వ్యవహరిస్తుందో ఏడుస్తూ చెబుతోంది. యుద్ధంలో దెబ్బతిన్న దేశం గురించి ప్రపంచం ఏ మాత్రం పట్టించుకోదని ఆమె ఆవేదన చెందుతోంది. క్రమంగా మేము చరిత్ర నుంచి కనుమరుగవుతాము అని కన్నీళ్లతో చెబుతోంది.

తాలిబన్లు కాబూల్ స్వాధీనం చేసుకునే ముందు అలీనజాద్ శుక్రవారం ట్విట్టర్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఆమె ఆ శీర్షికలో ఇలా వ్రాసింది, "తాలిబన్ల ఆక్రమణతో ఆఫ్గన్ల భవిష్యత్తు అస్తవ్యస్తంగా మారిందని ఆఫ్గన్ అమ్మాయి కన్నీళ్లు పెట్టుకుంది. ఆఫ్ఘనిస్తాన్ మహిళల కోసం నా గుండె పగిలిపోతుంది. ప్రపంచం వారిని విఫలం చేసింది. చరిత్రలో ఈ విషాద సంఘటన మిగిలిపోతుంది."

తాలిబన్లు ఇస్లాం యొక్క కఠినమైన నియమాలను తిరిగి అమలు చేస్తారనే భయం కారణంగా మే చివరి నుండి లక్షలాది మంది ఆఫ్ఘన్‌లు తమ ఇళ్లను వదిలి పారిపోయారు. ఈ ఫుటేజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పటి నుండి చాలా మంది స్పందించారు. ఆవేదనతో రీ ట్వీట్ చేశారు. చాలామంది ఆఫ్ఘనిస్తాన్ దేశం పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి పారిపోవడంతో తాలిబన్ ఆఫ్ఘనిస్తాన్ నియంత్రణను సుస్థిరం చేసుకున్నప్పుడు అతని వీడియో వచ్చింది.

ఉగ్రవాదులు అధ్యక్ష భవనం నియంత్రణను స్వాధీనం చేసుకునే ముందు తాను ఎందుకు దేశం విడిచి వెళ్లిపోయానో వివరిస్తూ ఆఫ్ఘనిస్తాన్‌కు ఘనీ ఒక సందేశాన్ని విడుదల చేశాడు. 'గత 20 సంవత్సరాలుగా ఆఫ్గన్లను రక్షించడానికి నా జీవితాన్ని అంకితం చేశాను. నా ప్రియమైన దేశాన్ని విడిచిపెట్టేముందు కొన్ని 'కఠిన నిర్ణయాలు' ఎదుర్కొన్నట్లు వివరించారు.

దేశాన్ని ఇలానే వదిలేస్తే లెక్కలేనంత మంది దేశభక్తులు అమరులవుతారు. కాబూల్ నగరం నాశనమవుతుంది. దీని ఫలితంగా ఆరు మిలియన్ల జనాభా ఉన్న నగరంలో ఒక పెద్ద మానవతా విపత్తు ఏర్పడుతుంది." అని ఆవేదన చెందుతూ సందేశాన్ని విడుదల చేశారు.

Tags

Read MoreRead Less
Next Story